Venkatesh - Mahesh - Bunny: మహేష్, అల్లు అర్జున్ బాటలో వెంకటేష్.. జానియర్స్ రూట్లో సీనియర్ హీరో..

Venkatesh - Mahesh - Bunny: మహేష్ బాబు, అల్లు అర్జున్ బాటలో వెంకటేష్ కూడా నడుస్తున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సీనియర్స్ బాటలో జూనియర్ హీరోలు నడుస్తుంటారు. కానీ సీనియర్ హీరో వెంకటేష్ ఇపుడు జూనియర్ హీరో బాటలో ఇపుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2024, 03:05 PM IST
Venkatesh - Mahesh - Bunny: మహేష్, అల్లు అర్జున్ బాటలో వెంకటేష్.. జానియర్స్ రూట్లో సీనియర్ హీరో..

Venkatesh - Mahesh - Bunny: టాలీవుడ్ సినీ హీరోలు ఒకరి వెనక మరొకరు థియేటర్స్ బిజినెస్ అదేనండి మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాల్లో సంపాదించిన సంపాదనను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్ చేయడమనేది ఎన్టీఆర్ ,ఏఎఎన్నార్ కాలం నుంచే వుంది. అప్పట్లోనే అన్న ఎన్టీఆర్.. రామకృష్ణ, తారకరామ థియేటర్స్‌ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికీ ఆ థియేటర్స్‌ హైదరాబాద్‌లో రన్ అవుతూనే ఉన్నాయి. ఇక మిగతా హీరోలు కూడా ఈ థియేటర్స్ బిజినెస్‌లోకి వచ్చినా.. ప్రజలకు ఆయా థియేటర్స్ వాళ్లవి అనేవి తెలిసేవి కావు. కానీ ఇపుడు హీరోల పేరుతోనే డైరెక్ట్ మల్టీప్లెక్స్ వస్తున్నాయి. దీంతో హీరోలతో పాటు ఆయా థియేటర్స్ సినిమాలు చూడడానికి మామలు జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక  సూపర్ స్టార్ మహేష్‌ బాబు హైదరాబాద్‌ హైటెక్ సిటీలో AMB మల్టీప్లెక్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మల్టీప్లెక్స్‌ను ఏషియన్ గ్రూపుతో కలిసి భారీగా నిర్మించారు. ఇపుడీ థియేటర్‌లో సినిమా చూడటం అనేది మూవీ లవర్స్‌కు ఓ ప్యాషన్‌ కమ్ డెస్టినేషన్  అయిపోయింది.  అంతేకాదు హైదరాబాద్ సిటీలో అత్యంత బిగ్గెస్ట్ మాల్ గా కూడా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత చాలా మంది తెలుగు హీరోలు వాళ్లు సొంత ఊళ్లలో థియేటర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అటు ఐకాన్ స్టార్ కూడా అమీర్ పేట్‌లో AAA సినిమాస్ అంటూ గ్రాండ్‌గా ఏషియన్ వాళ్లతో కలిసి ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. అటు బన్ని కంటే ముందే విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్‌లో AVD అంటూ మల్టీప్లెక్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా.  ఈ మల్టీప్లెక్స్‌లు అన్ని కూడా ఏషియన్ గ్రూపు ఆయా హీరోలతో కలిసి నిర్మించింది. అటు ప్రభాస్ కూడా నెల్లూరులో తన స్నేహితులతో కలిసి ఓ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా రవితేజ కూడా హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో ఏషియన్ గ్రూపుతో కలిసి ART పేరుతో త్వరలో ప్రారంభం కానుంది.

ఇక విక్టరీ వెంకటేష్ కుటుంబ వ్యాపారంలో థియేటర్స్ బిజినెస్ కూడా ఉంది. అన్న సురేష్ బాబు ఈ థియేటర్స్ బిజినెస్ చూసుకుంటున్నారు. ఇపుడు తన బిరుదు కలిసొచ్చేలా మహేష్ బాబు, ఏషియన్ గ్రూపుతో కలిసి హైదరాబాద్ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం ప్లేస్‌లో త్వరలో AMB Victory పేరుతో ఓ మల్టీప్లెక్స్ రానుంది. వెంకటేష్ తన బిరుదు విక్టరీ వచ్చేలా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో పార్టనర్ కానున్నారు. అటు తారక్, రామ్ చరణ్ వంటి హీరోలు  కూడా త్వరలో ఈ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News