Family Star: విజయ్‌ దేవరకొండనే టార్గెట్‌.. ఫేక్‌ న్యూస్‌పై 'ఫ్యామిలీ స్టార్‌' టీమ్‌ పోరాటం

Family Star Legal Fight On Fake News: సినిమా బాగున్నా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంతో 'ఫ్యామిలీ స్టార్‌' బృందం పోలీసులను ఆశ్రయించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 7, 2024, 11:06 PM IST
Family Star: విజయ్‌ దేవరకొండనే టార్గెట్‌..  ఫేక్‌ న్యూస్‌పై 'ఫ్యామిలీ స్టార్‌' టీమ్‌ పోరాటం

Family Star: సినీ పరిశ్రమకు తప్పుడు ప్రచారం అనేది మరో బెడదగా మారింది. థియేటర్లలో విడుదలైన సినిమాపై సామాజిక మాధ్యమాల ద్వారా వ్యతిరేక ప్రచారం జరగడం సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్‌'కు కూడా అదే సమస్య ఎదురైంది. ఏప్రిల్‌ 5వ తేదీన విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం వ్యతిరేక ప్రచారం సాగుతోంది. ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం సాగుతుండడంతో చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: Klin Kaara: గుండు చేయించుకున్న రామ్‌చరణ్‌ కుమార్తె క్లీంకార.. ఎందుకంటే?

ఈ సినిమాకు విజయం దక్కకూడదని, పేరు ప్రఖ్యాతులు రాకుండా కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పని గట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయని విజయ్‌ దేవరకొండ టీమ్‌ ఆరోపించింది. ఈ మేరకు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌కు విజయ్‌ టీమ్‌ ఫిర్యాదు చేసింది. ఆదివారం సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌లో విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు అందించారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వాటికి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ వంటివి ఆధారాలతో సహా సమర్పించారు.  కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Ranbir Kapoor: 'యానిమల్‌' హీరో రణ్‌బీర్‌ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ఈ కారు ఫీచర్లు, ధర తెలిస్తే షాకే..

ఉద్దేశపూర్వకంగా కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమాపై దుష్ప్రచారంతో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారని విజయ్‌ టీమ్‌ తెలిపింది. వారి ప్రచారం కారణంగా సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని వాపోయింది. కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా  విష ప్రచారం చేయిస్తోంది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు సైతం సినిమా బాగుందని చెబుతున్నారు.. కానీ కొందరు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయ్‌ టీమ్‌ ఆరోపించింది.

ఈ ప్రచారంపై సినిమా నిర్మాత దిల్‌ రాజు స్పందిస్తూ.. 'ఫ్యామిలీ స్టార్‌'పై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే.. సోషల్‌ మీడియాలో మాత్రం మరొకలా ట్రోల్‌ చేస్తున్నారు. దుష్ప్రచారం సినీ పరిశ్రమకు మంచిది కాదు. మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం సరికాదు. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News