Apache Rtr 160 New Model 2024: బ్లాక్‌ ఎడిషన్‌లో కొత్త Apache RTR 160 బైకులు.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తున్నాయి!

Apache Rtr 160 New Model 2024: ప్రముఖ మోటర్‌ సైకిల్ కంపెనీ TVS గుడ్‌ న్యూస్‌ తెలిపింది. బ్లాక్‌ ఎడిషన్‌లో Apache RTR 160, Apache RTR 160 4V మోటర్‌ సైకిల్స్‌ని లాంచ్‌ చేసింది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 18, 2024, 12:20 PM IST
Apache Rtr 160 New Model 2024: బ్లాక్‌ ఎడిషన్‌లో కొత్త Apache RTR 160 బైకులు.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తున్నాయి!

 

Apache Rtr 160 New Model 2024: ప్రీమియం ఫీచర్స్‌ ఉన్న మంచి బైక్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ TVS గుడ్‌ న్యూస్‌ తెలిపింది. గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన Apache RTR 160, Apache RTR 160 4V బైక్‌లను బ్లాక్‌ ఎడిషన్‌లో లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ రెండు బైక్స్‌  బ్లాక్‌ కలర్‌ థీమ్‌తో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వీటి రెండింటికి వాటి పెట్రోల్‌ ట్యాంక్‌లపై బ్లాక్ ఫినిషింగ్, బ్లాక్ టీవీఎస్ అపాచీ లోగోను అందించింది. ఈ రెండు మోడల్స్‌కి మడ్‌గార్డ్, బాడీ ప్యానెల్‌ను కూడా నలుపు రంగులో అందించింది. దీంతో పాటు వీటిల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు మోటర్‌ సైకిల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పవర్‌ట్రెయిన్ పూర్తి వివరాలు:
ఈ TVS Apache RTR 160 మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, ఇది 160cc మోటార్‌ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది గరిష్టంగా 15.82bhp శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక Apache RTR 160 4V బైక్‌ వివరాల్లోకి వెళితే, ఈ బైక్‌ 160cc ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 17.35bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఈ రెండు స్కూటర్స్‌ రైడింగ్‌ మోడ్‌ ఆప్షన్స్‌తో వచ్చాయి. ఇక ఈ TVS Apache RTR 160 మోటర్‌ సైకిల్ విషయానికొస్తే, ఈ బెక్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్‌ ఎండ్‌ TVS Apache RTR 160 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షల నుంచి లభిస్తోంది. 

స్టాండర్డ్ వేరియంట్‌లో ఫీచర్స్‌:
ఇక ఈ రెండు బైక్‌లకు సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే, ఈ TVS Apache RTR 160 మోటర్‌ సైకిల్‌ లీటర్‌కు 50 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇక దీని ఫీచర్స్‌ చూస్తే.. ఇది LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 200 mm డిస్క్ బ్రేక్‌తో వచ్చింది. ఇది ఆల్-బ్లాక్ 6-స్పోక్ అల్లాయ్ వీల్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ బైక్‌లో ల్యాంప్ టైమర్, అనలాగ్ టాకోమీటర్‌తో పాటు అనేక కొత్త ఫీచర్స్‌ లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Apache RTR 160 4V టాప్ 10 ఫీచర్స్:
రేస్ డెరివ్డ్ O3C ఇంజన్
స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌లు
రేడియల్ ఫ్రంట్ టైర్
120/70-17 టైర్ మెరుగైన గ్రిప్ 
240 mm రియర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‌
7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్
ఫెదర్ టచ్ స్టార్ట్
LED హెడ్‌ల్యాంప్
ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
డ్యూయల్-ఛానల్ ABS 
ఫైర్‌-రెసిస్టెంట్ ఫ్యూయల్ ట్యాంక్
డ్యూయల్-టోన్ హార్న్
USB చార్జింగ్ పోర్ట్
ఎగ్జాస్ట్ ఫ్యాన్
ఎకానమీ మోడ్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News