AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలం

AP Poll Percentage: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగడంతో తుది పోలింగ్ ఎంత అనేది ఇంకా స్పష్టత లేదు. భారీగా నమోదైన పోలింగ్ అధికార పార్టీకు అనుకూలమా లేక ప్రతిపక్షాలకు సానుకూలమా అనేది అర్ధం కాని పరిస్థితి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2024, 07:14 AM IST
AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలం

AP Poll Percentage: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపించారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే పరిస్థితి కన్పిస్తోంది. అర్ధరాత్రి వరకూ 78 శాతం వరకూ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఏయే జిల్లాల్లో ఎంత ఓటింగ్ నమోదైందనే వివరాలు తెలుసుకుందాం..

ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 6 గంటల తరువాత కూడా క్యూ లైన్లలో చాలామంది ఉండటంతో ఓటింగ్ మరింత పెరగవచ్చని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల తరువాత కూడా 3500కు పైగా పోలింక్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. విశాఖపట్నం జిల్లాలో దాదాపు 135 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ ఓట్లేశారు. ఎండల్ని, వర్షాల్ని లెక్కచేయకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం. అటు ఉద్యోగ, వ్యాపార, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవాల్లు ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత శాతం ఓటింగ్ నమోదైందో తెలుసుకుందాం.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19, అనకాపల్లిలో 81.63 శాతం, అనంతపురంలో 79.25, అన్నమయ్య జిల్లాలో 76.12 శాతం, బాపట్లలో 82.33 శాతం, చిత్తూరులో 82.65 శాతం, కోనసీమలో 83.19 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 79.31 శాతం, ఏలూరులో 83.04 శాతం, గుంటూరులో 75.74 శాతం, కాకినాడలో 76.37 శాతం, కృష్ణా జిల్లాలో 82.20 , కర్నూలులో 75.83, నంద్యాలలో 80.92, ఎన్టీఆర్ జిల్లాలో 78.76 శాతం, పల్నాడులో 78.70 శాతం నమోదైంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో 75.24 శాతం, ప్రకాశం జిల్లాలో 82.40 శాతం, నెల్లూరులో 78.10 శాతం, సత్యసాయి జిల్లాలో 82.77 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 75.41 శాతం, తిరుపతిలో 76.83 శాతం నమోదైంది. ఇక విశాఖపట్నం జిల్లాలో 65.50 శాతం, విజయనగరం జిల్లాలో 79.41 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో  81.12 శాతం, కడపలో 78.71 శాతం నమోదైంది.

ఇదే ఇప్పుడు అంచనాలకు అందడం లేదు. ఎవరికివారు భారీ పోలింగ్ తమకు అనుకూలమని లెక్కలు వేస్తున్నారు. వాస్తవానికి 2019లో 79-80 శాతం మధ్యలో నమోదై అప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా 2009 కంటే ఎక్కువ పోలింగ్ నమోదై తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైంది. అయితే ఈసారి పోలింగ్ 79-80 శాతం వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఎవరికి అనుకూలమనే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. 

Also read: AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News