Imran Khan No Confidence: ఇమ్రాన్ ఖాన్‌కు తప్పిన పదవీ గండం.. పాక్‌లో మధ్యంతర ఎన్నికలు!

Imran Khan No Confidence: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం తప్పింది. ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మారాన్ని స్పీకర్ తిరస్కరించడం వల్ల ఆయన పదవీ కోల్పోలేదు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సిఫారసు చేశారు. దీంతో మూడు నెలల తర్వాత పాకిస్థాన్ లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 04:06 PM IST
Imran Khan No Confidence: ఇమ్రాన్ ఖాన్‌కు తప్పిన పదవీ గండం.. పాక్‌లో మధ్యంతర ఎన్నికలు!

Imran Khan No Confidence: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కు పదవీ గండం తప్పింది. విపక్షాలు ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ తిరస్కరించారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. అనంతరం పాక్ జాతీయ అసెంబ్లీని ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించినట్లు అయ్యింది.

అసెంబ్లీకి ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరు!

మరోవైపు విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే  క్రమంలో ఇమ్రాన్‌  జాతీయ అసెంబ్లీకి హాజరు కాలేదు. పైగా జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్‌ఖాన్‌ సిఫారుసు చేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గ పదవికి వదులుకోవడం కంటే నేరుగా ఎన్నికలకు వెళ్లాలని భావించారు. అయితే స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకపోవడం వల్ల ఇమ్రాన్ కు పదవీ గండం తప్పింది.

అవిశ్వాసం జరిగి ఉంటే..?

అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్‌  పార్టీ పీటీఐ నుంచి 22 మంది మాత్రమే జాతీయ అసెంబ్లీకి హాజరు అయ్యారు. విపక్షాల నుంచి 176 మంది హాజరయ్యారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ప్రవేశపెట్టి ఉంటే ఇమ్రాన్‌ ఖాన్‌ తన పదవిని కోల్పోయేవారు. 

ముందస్తు ఎన్నికలకు..

మరోవైపు  జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని అధ్యక్షుడిని ఇమ్రాన్ ఖాన్ సిఫారుసు చేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్‌లో ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విదేశీ కుట్రలో భాగంగానే తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారన్నారు. మరొకవైపు పాక్‌ జాతీయ అసెంబ్లీని పాక్ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ రద్దు చేశారు. ముందుస్తు ఎన్నికలకు పిలుపు నిచ్చారు. 

Also Read: Sri Lanka Emergency: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు గొయబాయ రాజపక్స.. కారణం అదేనా?

Also Read: Afghanistan Blast: అఫ్గానిస్థాన్ లో భారీ పేలుడు.. 12 మంది మృతి, 25 మందికి తీవ్రగాయాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News