DC vs MI Highlights: 'ఆ తెలుగు కుర్రాడే మా ఓటమికి కారణం'.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు

Hardik Pandya latest: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా హార్దిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 28, 2024, 01:50 PM IST
DC vs MI Highlights: 'ఆ తెలుగు కుర్రాడే మా ఓటమికి కారణం'.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు

IPL 2024, DC vs MI:  ఐపీఎల్ సీజన్ 17లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ద్వారా హార్దిక్ సేన ఫ్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన ముంబై కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ -0.261గా ఉంది. నిన్న జరిగిన మ్యాచ్ లో స్వల్ప తేడాతో ఓడిపోవడంతో హార్ధిక్ పాండ్యా బాగా ఫీలయ్యాడు. ఈ సందర్భంగా జట్టు పరాజయం పాలవ్వడానికి గల కారణాలను వివరించాడు. 

'వారే మా ఓటమికి కారణం': పాండ్యా
శనివారం పంత్ సేన చేతిలో ముంబై ఓడిపోవడానికి చాలానే కారణాలున్నా.. హార్దిక్ పాండ్యా చెప్పిన ఓ రీజన్ మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ, నేహాల్ వధేరాలే తమ ఓటమికి కారణంగా పాండ్యా పేర్కొన్నాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లు అయిన వారిద్దరూ అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్లు ఆడాల్సిందని.. కానీ సింగిల్స్ తో సరిపెట్టారని పాండ్యా ఆరోపించాడు. పరోక్షంగా వారిద్దరే ఓటమిగా కారణంగా హార్దిక్ పేర్కొన్నాడు. 

Also Read: KL Rahul: ఐపీఎల్‌లో రాహుల్ రేర్ ఫీట్.. ధావన్, కోహ్లీ తర్వాత మనోడే..

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ప్రశ్నలు లేవనెత్తిన పంత్
'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై ఆందోళన వ్యక్తం చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చేరాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధించిన ఢిల్లీ జట్టు అతి స్వల్ప తేడాతో గెలిచింది.  గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను నాలుగు పరుగుల తేడాతో ఓడించిన పంత్ సేన.. శనివారం ముంబై ఇండియన్స్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Also Read: Shashank Singh: ఐపీఎల్‌లో నయా హీరో.. బౌలర్లకు సింహస్వప్నంలా శశాంక్ సింగ్.. అసలు ఎవరితను?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News