Gajakesari Yoga: జనవరి 18న గజకేసరి యోగం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి తలుపు తట్టబోతోంది..

Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కనక వర్షం కురువబోతోంది. ఇంతకుముందు ఎప్పుడూ ఊహించలేని లాభాలు కూడా పొందబోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 11:12 AM IST
Gajakesari Yoga: జనవరి 18న గజకేసరి యోగం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి తలుపు తట్టబోతోంది..

Horoscope: ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది ఎందుకంటే జనవరి నెలలోనే అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా జనవరి 18 జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం జనవరి 20న ముగుస్తుంది. జనవరి 18 చంద్ర గ్రహం మేషరాశిలోకి సంచారం చేయడం, అదే రాశిలో ఉన్న బృహస్పతి కలవడం కారణంగా ఈ ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. ఒకే రాశులు గురుగ్రహంతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఈ గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి.

మేష రాశి:
గజకేసరి యోగం కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా అత్తమామల ఇంటి నుంచి శుభవార్తలు వింటారు. దీనికి కారణంగా మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ యోగం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతోపాటు స్నేహితులతో కలిసి సుదూర ప్రయాణాలు చేయిస్తారు. అంతేకాకుండా వైవాహిక జీవితం ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా బాగుంటుంది.

మిధున రాశి:
మిథున రాశి వారికి కూడా గజకేసరి రాజయోగం ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారు పించని ఆదాయ వనరులు పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఇంతక ముందున్న దానికంటే ఇప్పుడు చాలా ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యంగా జర్నలిజం రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో కష్టపడి పనిచేయడం వల్ల జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

తులారాశి:
తులా రాశి వారికి గజకేసరి యోగం వల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ సమయం నుంచి శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించడమే కాకుండా ఎంతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటు వీరు ఆస్తులు, ఇల్లు, కారు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగాల్లో నిమగ్నమై ఉన్నవారు ఈ సమయంలో మంచి పేరు పొందుతారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా ఈ గజకేసరి రాజయోగం చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దోశకరమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఇతరులతో గొడవలు పెట్టుకోవడం మానుకోవాలి లేకపోతే తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News