Iron Deficiency: ఐరన్ లోపముంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి

శరీరంలో ఏదైనా పోషకం లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఈ పోషకాల్లో ముఖ్యమైంది ఐరన్. ఐరన్ లోపిస్తే చాలా సమస్యగా మారుతుంది. మీక్కూడా ఈ పరిస్థితి ఉంటే వెంటనే మీ డైట్ ఇలా మార్చుకోండి

Iron Deficiency: శరీరంలో ఏదైనా పోషకం లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఈ పోషకాల్లో ముఖ్యమైంది ఐరన్. ఐరన్ లోపిస్తే చాలా సమస్యగా మారుతుంది. మీక్కూడా ఈ పరిస్థితి ఉంటే వెంటనే మీ డైట్ ఇలా మార్చుకోండి

1 /5

పండ్లు కూరగాయలు పండ్లు కూరగాయల్లో శరీరానికి అవసరమైన ఐరన్ పెద్దమొత్తంలో లబిస్తుంది. చాలారకాల వ్యాధులు కూడా దూరమౌతాయి. ప్రతి కూరగాయలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 

2 /5

పాలకూర పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రోజూ డైట్‌లో పాలకూర చేర్చడం వల్ల ఐరన్ లోపమొక్కటే కాకుండా కాల్షియం, సోడియం, మినరల్స్, క్లోరిన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఐరన్ లోపమనేది దరిదాపుల్లో రాదు. 

3 /5

బీట్‌రూట్ బీట్‌రూట్ రోజూ తీసుకుంటే శరీరంలో రక్తహీనత పోతుంది. ఐరన్ లోపించడం వల్ల సంభవించే పలు వ్యాధులు కూడా దూరమౌతాయి. బీట్‌రూట్ జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచిది. బీట్‌రూట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడుతుంది.

4 /5

గుడ్లు గుడ్లు ఎప్పుడూ ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచి పద్ధతి. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ పెద్దమొత్తంలో ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఐరన్ లోపం ఉండదు. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపముండేవారు రోజుకో గుడ్డు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

5 /5

దానిమ్మ శరీరంలో విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. ఇవి లోపిస్తే పలు సమస్యలు ఎదురౌతాయి. అలాంటి మినరల్స్‌లో ఐరన్ అత్యంత కీలకమైంది. ఐరన్ లోపిస్తే అలసట, బలహీనత వంటి సమస్యలు ఎదురౌతాయి. ఐరన్ లోపమున్నప్పుడు డైట్‌లో ముందుగా చేర్చాల్సింది దానిమ్మ.