UP Topper Prachi Nigam: అట్లుంటదీ మరీ.. ట్రోలర్స్ కు చాణక్యుడి స్టైల్ లో కౌంటర్ ఇచ్చిన యూపీస్టేట్ టాపర్..

UP Topper Prachi Nigam:ఉత్తర్ ప్రదేశ్ టెన్త్  స్టేట్ టాపర్ ప్రాచీ నిగమ్ కు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దీనిపై ఆమె తాజగా, చాణక్యుడి స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. దీంతో ప్రాచీ నిగమ్ మరోసారి వార్తలలో నిలిచారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2024, 10:48 AM IST
  • ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన ప్రాచీ నిగమ్..
  • మరోసారి ట్రెండింగ్ లో నిలిచినయూపీ టాపర్..
UP Topper Prachi Nigam: అట్లుంటదీ మరీ.. ట్రోలర్స్ కు చాణక్యుడి స్టైల్ లో కౌంటర్ ఇచ్చిన యూపీస్టేట్ టాపర్..

UP Topper Prachi Nigam Strong Counter To Trollers: ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ కు చెందిన ప్రాచీ నిగమ్ టెన్త్ రిజల్ట్ లో రాష్ట్రంలోనే టాప్ స్కోర్ సాధించారు. ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ ఏప్రిల్ 20న , ఎస్సెస్సీ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. దీనిలో.. ప్రాచీనిగమ్..600కు గాను 591 మార్కులు సంపాదించింది.98.50 శాతం పర్సెంటెజ్ తో ఆమె యూపీలో టాప్ ప్లేస్ లో నిలిచింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూను కొందరు నెటిజన్ లు ట్రోలింగ్ చేశారు. ఆమెకు మీసాలు కన్పిస్తున్నాయని, ముఖం అబ్బాయిల మాదిరిగా ఉందంటూ నీచంగా కామెంట్లు పెట్టారు. ఒక యువతి, అందులో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన యువతని పట్టుకుని కొందరు వేధించడంతో ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అదే సోషల్ మీడియాలో ప్రాచీనిగమ్ కు మరికొందరు సపోర్టు చేస్తు అండగా నిలిచారు. ఈక్రమంలో తాజాగా, ప్రాచీనిగమ్ చాణక్యుడి స్టైల్ లో ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఘటన మరోసారి  వార్తలలో నిలిచింది.

Read More: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..

ప్రాచీనిగమ్ మాట్లాడుతూ.. గొప్ప వారంతా ట్రోలింగ్ బారిన పడిన వాళ్లే అంటు చెప్పుకొచ్చింది. చాణక్యుడికి కూడా కొంత మంది రాజులు ఇదే విధంగా నవ్వుకుంటూ చులకనగా చూశారన్నారు. కానీ ఆయన మాత్రం తన పట్టుదలతో, తనను గేలీ చేసిన వారికి బుధ్ది చెప్పాడని అన్నారు. తాను కూడా చాణక్యుడిని ఫాలో అవుతానని, ఆయన చెప్పిన లైఫ్ లెసెన్స్, కొటేషన్స్ చదువుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. ఆయన లాగే , తాను కూడా భవిష్యత్తులో ఒకగొప్పస్థానంలో ఉంటానని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ లను పట్టించుకోవట్లేదని ఆమె తెలిపారు. అదే విధంగా తనకు సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచిన వారందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

మనిషిలోని,టాలెంట్, ప్రతిభ గొప్పదని చెప్పుకొచ్చింది. మనిషిలోని విద్య మాత్రమే ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ప్రాచీ నిగమ్ వివరించింది. ఇలాంటి ట్రోలింగ్ చూసి, భయపడకూడదని, వెన్ను చూపకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఆమె యువతకు మంచి సందేశం ఇచ్చింది. ప్రాచీ ఫోటో గతంలో..సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ట్రెండింగ్ లో నిలిచారు. కొందరు ఆమె ముఖ వెంట్రుకలపై ఆమెను ట్రోల్ చేయగా, మరికొందరు టీనేజ్‌కి తమ మద్దతును అందించారు.  

Read More: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..

బోర్డు పరీక్షలో ఆమె ప్రదర్శనకు ఆమెను అభినందించారు. ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయబడిన తర్వాత, యువతికి మద్దతుగా ఆన్‌లైన్ కమ్యూనిటీ ట్రోల్‌లకు వ్యతిరేకంగా పోరాడింది. ప్రాచీపై ఇలాంటి వ్యాఖ్యల వల్ల కలిగే భావోద్వేగ ప్రభావంపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ప్రాచీతో మాట్లాడి చదువుపై దృష్టి పెట్టాలని, ఆమె కలలను సాధించుకోవాలని చెప్పినట్లు సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News