HDL Cholesterol: గుడ్ కొలెస్ట్రాల్ ప్రయోజనాలేంటి, ఏయే పదార్ధాలు తింటే పెరుగుతుంది

HDL Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఏ మాత్రం మంచిది కాదు. ప్రాణాంతక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులకు కారణమౌతుంది. అదే సమయంలో హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ నేపధ్యంలో గుడ్ కొలెస్ట్రాల్ పెంచే ఆహార పదార్ధాలేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 28, 2024, 03:11 PM IST
HDL Cholesterol: గుడ్ కొలెస్ట్రాల్ ప్రయోజనాలేంటి, ఏయే పదార్ధాలు తింటే పెరుగుతుంది

HDL Cholesterol: మనిషి శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు కొలెస్ట్రాల్ ఎంత అవసరమో అంతే నష్టం కూడా కల్గిస్తుంది. అయితే ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి ఎల్‌డీఎల్. దీనినే చెడు కొలెస్ట్రాల్ అంటారు. రెండవది హెచ్‌డీఎల్. గుడ్ కొలెస్ట్రాల్‌గా పిలుస్తారు. హెచ్‌డీఎల్ అధికంగా ఉంటే గుండె వ్యాధుల ముప్పు తగ్గిపోతుంది. అదే ఎల్‌డీఎల్ అధికంగా ఉంటే మాత్రం గుండె వ్యాధులు, స్ట్రోక్ ముప్పుపెరుగుతుంది. అందుకే ఈ పరిస్థితిని నివారించేందుకు శరీరంలో హెచ్‌డీఎల్ స్థాయిని పెంచుకోవల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలి. 

సోయా బీన్స్ అనేవి మాంసంతో సమానంగా పోషక విలువలు కలిగిన శాకాహార పదార్ధం. సోయబీన్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్ కారణంగా హెచ్‌డీఎల్ స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఐసోఫ్లేవెన్స్ ఇందుకు దోహదం చేస్తాయి. ఫైటో ఈస్ట్రోజెన్ అనేది ఎల్‌డీఎల్ స్థాయితో పాటు ట్రై గ్లిసరాయిడ్స్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా లిపిడ్ ప్రొఫైల్‌లో మార్పు గమనించవచ్చు. 

చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అదికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. డైట్‌లో చియా సీడ్స్ చేరిస్తే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడమే కాకుండా రక్తపోటు తగ్గుతుంది. 

వాల్‌నట్స్‌లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఓ రకమైన మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి. గుండె వ్యాదుల్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. గుడ్ కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. 

జొన్నలు శరీరంలో బీటా గ్లూకోన్‌ను పెంచేందుకు దోహదపడతాయి. ఇందులో లిక్విపైడ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 

Also read: Healthy Juice: రోజూ ఈ 5 రూపాయల జ్యూస్ పరగడుపున తాగితే వ్యాధులకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News