Khiladi​ Movie Trailer: ఓ పాత్రలో మాస్​.. మరో క్యారెక్టర్​లో కామెడీతో అదరగొట్టిన 'ఖిలాడి' ట్రైలర్​

Khiladi​ Movie Trailer: రవి తేజ మరోసారి ద్విపాత్రాభినయం చేసిన ఖిలాడి మూవీ ట్రైలర్ విడుదలైంది. మాస్ డైలాగ్స్, యాక్షన్​ సీన్స్​ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 07:34 PM IST
  • ఆసక్తి రేపుతున్న ఖిలాడి ట్రైలర్​
  • ఆకట్టుకుంటున్న రవి తేజ డైలాగ్స్​
  • ద్విపాత్రాభినయంలో మాస్​ మహారాజా
Khiladi​ Movie Trailer: ఓ పాత్రలో మాస్​.. మరో క్యారెక్టర్​లో కామెడీతో అదరగొట్టిన 'ఖిలాడి' ట్రైలర్​

Khiladi​ Movie Trailer: మాస్​ మహారాజ రవి తేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో రవి తేజ ద్విపాత్ర అభినయం చేశారు.

ట్రైలర్ చూస్తే.. ఒక క్యారెక్టర్​ మాస్​ లుక్​తో మరో క్యారెక్టర్ సాఫ్ట్​ లుక్​తో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టు తిరగుతుందని అర్థమవుతోంది.

ఇక రవి తేజ చెప్పే డైలాంగ్స్​ అదిరిపోయాయి. 'ఎప్పుడూ ఒకే టీమ్​కు ఆడటానికి నేషనల్ ప్లేయర్​ను కాదు.. ఐపీఎల్​ ప్లేయర్​ను ఎవరు ఎక్కువకు పాడపుకుంటే వాళ్లకే ఆడుతా' అంటూ చెప్పే డైలాగ్​తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఇక రెండు క్యారెక్టర్ల మధ్య సంబంధం ఏమిటి? అనే విషయం తెలియాలంటే.. సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

ఇంకా ట్రైలర్​లో ఆసక్తికరమైన విషయాలు..

రవి తేజ అంటే అంటే యాక్షన్​తో పాటు కచ్చితంగా కామెడి కూడా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఈ సినిమాలో కామెడీకి కూడా పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది

ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్​, విలక్షణ నటుడు ముకేశ్​ రిషి, రావు రమేష్​, వెన్నెల కిశోర్​, జబర్ధస్త్ ఫేమ్​ అనసూయ సహా పలువురు ఈ సినిమాలో నటించారు.

ఈ సినిమాలో మీనాక్షీ చౌదరీ, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం రమేశ్​ వర్మ. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

రిలీజ్​ డేట్ ఎప్పుడంటే..

ఖిలాడి మూవీ తాజాగా సెన్సార్​ కూడా పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిచింది. ఈ నెల 11న థియేటర్లలో సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించింది.

Also read: Anupama Parameswaran Photos: కళ్లుతో కుర్రాళ్ల మదిని మాయచేస్తున్న మలయాళ బ్యూటీ అనుపమ

Also read: Karishma Tanna Dance: సమంత సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన కొత్త పెళ్లి కూతురు, నటి కరిష్మా తన్నా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News