Kia Clavis Price: టాటా కార్లకు ఇక కష్టమే..శక్తివంతమైన ఫీచర్స్‌తో kia clavis వచ్చేస్తోంది.. ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే!

Kia Clavis India Price: త్వరలోనే కియా నుంచి మరో కొత్త కారు మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ క్లావిస్ పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 19, 2024, 05:32 PM IST
Kia Clavis Price: టాటా కార్లకు ఇక కష్టమే..శక్తివంతమైన ఫీచర్స్‌తో kia clavis వచ్చేస్తోంది.. ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే!

 

Kia Clavis India Price: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ కియా మార్కెట్‌లోకి త్వరలోనే మరో కొత్త SUVని లాంచ్‌ చేయబోతోంది. కియా దీనిని  క్లావిస్ పేరుతో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ కారు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవలే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. అంతేకాకుండా కంపెనీ దీనిని ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కియా ఇండియా భారత్‌ వ్యాప్తంగా విడుదల కోసం కూడా ట్రేడ్‌మార్క్ చేసిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవలే ఈ SUV పరీక్షల కోసం రోడ్లపై కనిపించింది. అయితే ఈ కారుకు సంబంధించి లీక్‌ అయిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ కారు డిజైన్‌ ఎంతో ఆకర్శనీయంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఫ్రాంట్‌ భాగంలో చూస్తే, LED DRLలు, క్లామ్‌షెల్ బానెట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ముందు భాగంలో ఫ్రంట్ డోర్‌లో భాగంగా మౌంటెడ్ ORVMలు, డ్యూయల్-టోన్ రూఫ్ రైల్స్ కూడా ఉంటాయి. అలాగే దీని వెనుక భాగంలోకి వెళితే.. బ్యాక్‌ విండ్‌షీల్డ్‌కు రెండు వైపులా L-షేప్‌లో LED లైటింగ్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ కారు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్‌ లభించబోతున్నట్లు తెలుస్తోంది.  అలాగే కారు కింది భాగాల్లో బంపర్‌పై టెయిల్‌లైట్ కూడా లభిస్తున్నాయి. 

అంతేకాకుండా ఈ క్లావిస్ B-SUV ఎంతో పెద్దైన పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభించబోతోందని సమాచారం. ఇక ఈ కారు ఎంతో ఆకర్శనీయమైన వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 360-డిగ్రీ కెమెరా,  ADAS సూట్‌లను కూడా కలిగి ఉంటుంది. అలాగే 10.25-అంగుళాల కంట్రోల్‌ స్క్రీన్‌తో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ కారులో సేప్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు మొబైల్ కనెక్టివిటీని కూడా అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.    

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.. 

క్లావిస్‌లో కింది భాగంలో ఎంతో పవర్‌ ఫుల్‌ పవర్‌ట్రెయిన్‌తో రాబోతోంది. దీంతో పాటు ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఇంజన్‌  82 bhp, 114 nm శక్తి అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అలాగే క్లావిస్‌ SUV  5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్‌తో రాబోతుట్లు సమాచారం. లాంచ్‌ కాబోయే క్లావిస్‌ Kia ICE మోడల్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా దీనిని త్వరలోనే EV వేరియంట్‌లో కూడా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.  క్లావిస్ SUV మార్కెట్‌లోకి విడుదలైతే..ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News