Best 7-Seater Car @ Rs 5.25 Lakhs: కేవలం రూ. 5.25 లక్షలకే 7 సీటర్ కారు.. Ertiga, Bolero ను దాటేసిన అద్భుతమైన కారు

7-Seater Car Sales: మారుతి సుజుకి ఎర్టిగా ఇండియన్ మార్కెట్‌లో ప్రాచుర్యం పొందిన 7 సీటర్ కారు. అయితే ఇటీవల మరో చౌకైన 7 సీటర్ ఎర్టిగా సహా ఇతర కార్లన్నింటినీ వెనక్కి నెట్టి విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2023, 09:54 AM IST
Best 7-Seater Car @ Rs 5.25 Lakhs: కేవలం రూ. 5.25 లక్షలకే 7 సీటర్ కారు.. Ertiga, Bolero ను దాటేసిన అద్భుతమైన కారు

Best Selling 7-Seater Car 2023: భారతీయ మార్కెట్‌లో 7 సీటర్ కారుతో చాలా ప్రయోజనాలున్నాయి. పెద్ద కుటుంబమైతే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలంటే 7 సీటర్ మంచి ప్రత్యామ్నాయం. అందుకే ఇప్పటి వరకూ 7 సీటర్ విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా అగ్రస్థానంలో ఉంటూ వస్తోంది. 

మారుతి ఎర్టిగా 7 సీటర్ విక్రయాల్లో మొదటి స్థానంలో నిలవడానికి కారణం అత్యంత సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఇతర 7 సీటర్ వాహనాలతో పోలిస్తే ధర తక్కువ కావడం. ఇన్నోవా 7 సీటర్ కారుతో పోలిస్తే మారుతి ఎర్టిగా పెద్దఎత్తున విక్రయాలు నమోదుచేస్తోంది. ఫీచర్ల విషయంలో రెండింటికీ పెద్ద తేడా లేకపోయినా ధర విషయంలో ఈ రెండింటికీ చాలా వ్యత్యాసముంది. అందుకే మారుతి ఎర్టిగా క్రేజ్ ఎక్కువ. కానీ ఫిబ్రవరి నెలలో మాత్రం మారుతి ఎర్టిగా అమ్మకాల్లో వెనక్కి పడిపోయింది. మరో చౌకైన 7 సీటర్ ఈ స్థానాన్ని ఆక్రమించేసింది. ఈ కారు ఎర్టిగా సహా అన్ని ఇతర 7 సీటర్ కార్లను వెనక్కి నెట్టేసింది.

బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్..

అయితే ఇది కూడా మారుతి కంపెనీ కారే కావడం విశేషం. 2023 ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకీ ఈకో కారు దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన 7 సీటర్ కారుగా నిలిచింది. గత నెల మారుతి సుజుకి ఈకో కారు 11,352 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఏడాది క్రితం ఇదే కారు అంటే 2022 ఫిబ్రవరిలో కేవలం 9190 కార్లు అమ్మింది. అంటే ఏడాది వ్యవధిలో దాదాపు 24 శాతం వృద్ధి నమోదు చేసింది.

మారుతి ఈకో ధర 5.25 లక్షల నుంచి 6.51 లక్షల రూపాయలుంది. ఇది ఢిల్లీ ఎక్స్ షోరూం ధర. ఈ కారు నాలుగు వేరియంట్లలో లభ్యమౌతోంది. ఇందులో 5 సీటర్ స్టాండర్డ్ 5 సీటర్ ఏసీ, 5 సీటర్ ఏసీ సీఎన్జీ, 7 సీటర్ స్టాండర్డ్ ఉన్నాయి. మారుతి ఈకో తరువాత అత్యధికంగా అమ్ముడైన రెండవ కారు  మహీంద్రా బొలేరో. 2023 ఫిబ్రవరిలో ఈ కారు 9,782 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. అటు ఏడాది క్రితం 11,045 యూనిట్లు విక్రయాలు జరిపింది. అంటే మహీంద్రా బొలేరో అమ్మకాల్లో 11 శాతం తగ్గుదల నమోదైంది.

ఇక మారుతి సుజుకి ఎర్టిగా మూడవ స్థానంలో ఉంది. 2023 ఫిబ్రవరిలో ఎర్టిగా కేవలం 6472 యూనిట్లే అమ్మగలిగింది. అదే ఏడాది క్రితమైతే ఫిబ్రవరి 2022లో 11,045 యూనిట్లు అమ్మకాలు జరిపింది. అంటే ఎర్టిగా అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 44 శాతం తగ్గిపోవడం గమనార్హం.

Also Read: Mahindra Thar 5 Door: కొత్త ఎస్‌యూవీని తీసుకువస్తున్న మహీంద్రా.. ఇక మారుతీ జిమ్నీకి టాటా చెప్పాల్సిందే!

Also Read: 7 Seater SUV Car: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News