Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట

పెళ్లి ( Marriage ) చేసుకుంటే కాసుల వర్షం. జపాన్ లో ప్రభుత్వం కొత్త పథకం. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ కానుకలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుందట.

Last Updated : Sep 22, 2020, 08:48 PM IST
    • పెళ్లి చేసుకుంటే కాసుల వర్షం. జపాన్ లో ప్రభుత్వం కొత్త పథకం.
    • కొత్తగా పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ కానుకలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుందట.
    • ముందు ఏడడుగులు తిరగండి. తరువాత నాలుగు లక్షలు తీసుకోండి అంటోంది అక్కడి సర్కారు.
Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట

పెళ్లి ( Marriage ) చేసుకుంటే కాసుల వర్షం. జపాన్ లో ప్రభుత్వం కొత్త పథకం. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ కానుకలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుందట. ముందు ఏడడుగులు తిరగండి. తరువాత నాలుగు లక్షలు తీసుకోండి అంటోంది అక్కడి సర్కారు. అయితే దీనికోసం మీరు జపాన్ లో మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మీకు నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.

ALSO READ| WHO Kitchen Tips: ఇన్ఫెక్షన్ నుంచి ఆహారాన్ని సురక్షితంగా ఉంచే WHO చిట్కాలు 
పెళ్లి వద్దంటున్న కుర్రకారు
జపాన్ లో ( Japan ) పెళ్లి చేసుకోవడానికి కుర్రకారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారట. దాంతో పెళ్లి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందట. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం ఈ విషయంపై పలు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోండట. ఎందుకంటే ఇలా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగితే జపాన్ లో కుటుంబ వ్యవస్థ ( Family ) నాశనం అయ్యే అవకాశం ఉంది. దీంతో దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న జంటకు అక్కడి ప్రభుత్వం నాలుగున్నర లక్షల బహుమతి ఇవ్వాలి అని నిర్ణయించిదట.

ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు

ఆరవై ఏళ్ల వాళ్లే అధికం...
జపాన్ లో వయస్సుపైబడ్డ వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. యువకుల ( Youth ) సంఖ్య బాగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం పెళ్లిపై అక్కడ చాలా మందికి అయిష్టం పెరిగటం. పన్నెండు కోట్ల జనాభా ఉన్న జపాన్ లో కుటుంబ జీవితం ప్రారంభించాలి అనుకుంటున్న వారికి ఇలా గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 

జనాభా పెరుగుదలపై అదుపు
జపాన్ ప్రభుత్వం పెళ్లి చేసుకోవాలి అనుకునేవారికి ఇప్పుడు 4.25 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం యువత పెళ్లిపై ఆసక్తి పెంచుకుని పిల్లలను కనడం. అయితే దీనిపై అక్కడి యువత ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. 

ALSO READ| Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

Trending News