Telangana Bjp: బీజేపీ నేతలను ఊరిస్తున్న కేంద్ర పదవులు

Telangana Bjp: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర పదవి ఊరిస్తోంది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత...మరో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. 

  • Zee Media Bureau
  • Jul 12, 2023, 06:46 PM IST

Telangana Bjp: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర పదవి ఊరిస్తోంది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత...మరో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. సంజయ్ కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చోటు కల్పించారు. అనూహ్యంగా పదవి నుంచి తప్పుకోవాల్సిన సంజయ్‌కు కేంద్ర పదవిని కట్టబెడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పార్టీలో జాతీయ స్థాయిలో ఓబీసీ చైర్మన్‌గా ఉన్న డాక్టర్‌ లక్ష్మణ్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న వివేక్‌కు కేంద్ర పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అటు విజయశాంతి కూడా కేంద్ర మంత్రి పదవి అశీస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో SC సామాజిక వర్గానికి చెందిన వివేక్‌కు ఆ పదవి ఇవ్వడం ద్వారా వారి ఓట్లను ఆకర్షించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News