త్వరలో తెలంగాణలో ప్రవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

Last Updated : Oct 28, 2017, 09:50 AM IST
త్వరలో తెలంగాణలో ప్రవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైల్వే కోచ్ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి జిల్లాలోని కొండకల్లో రైల్/మెట్రో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు తెలిపారు. మంత్రి శుక్రవారం, భారతీయ రైల్వేకు చోదన పరికరాల సరఫరాదారు అయిన మేధా సర్వో డ్రైవ్స్ తో ఎంఓయు సంతకం వేడుకకు హాజరయ్యారు. ఒక హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం.. మేధా సర్వో డ్రైవ్స్ తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..  'రైల్వే కోచ్ కర్మాగారం సుమారు 600 నుండి 800 కోట్లతో రంగారెడ్డి, సంగారెడ్డి సరిహద్దు గ్రామం కొండకల్ లో ఏర్పాటుకానుంది. దీని ద్వారా రెండు వేల కోట్ల మందికి ప్రత్యక, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ  పరిశ్రమకు టీఎస్ఐసిసి  ద్వారా 100 ఎకరాలు కేటాయించాము. రాబోయే కర్మాగారం కోసం అవసరమైన సిబ్బంది, శిక్షణ కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ తో కలిసి కంపెనీ పనిచేస్తుంది. మరో మూడు, నాలుగు నెలల్లో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాము." అని చెప్పారు. 

Trending News