BJP Madhavi Latha: ఓల్డ్ సిటీలో చివరి గంటలో 14 శాతం పోలింగ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాధవీలత..

Loksabha elections 2024: పాత బస్తీలో చివరి గంటలో మజ్లీస్ పార్టీకి చెందిన వారు భారీగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని బీజేపీ మాధవీలత ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం 35 ఉండగా.. కేవలం చివరి గంటలో 14 శాతం ఎలా అవుతుందని ఆమె పలుఅనుమానాలు వ్యక్తం చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 14, 2024, 03:14 PM IST
  • మజ్లీస్ నేతలు రిగ్గింగ్ చేశారన్న మాధవీలత..
  • ఈసీ చర్యలు తీసుకొవాలని డిమాండ్..
BJP Madhavi Latha: ఓల్డ్ సిటీలో చివరి గంటలో 14 శాతం పోలింగ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాధవీలత..

Bjp madhavi latha hot comments on hyderabad old city last one hour voting: దేశంలో నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మే 13 న ఎన్నికలు నిర్వహించింది. ఇదిలా ఉండగా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకొవడానికి ఆసక్తి  చూపించారు. ఇక హైదరాబాద్ లోని ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే తమ నెగ్లీజెన్సీని మరోమారు చూపించారు. ఈసారి కూడా కనీసం యాభైశాతం కూడా హైదరాబాద్ లో ఓటింగ్ నమోదు కాలేదు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ ఎంపీ స్థానం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌ గా మారింది.

Read more: Dk Aruna: రేవంత్ జూటా మాటలు మాట్లాడుతున్నారు.. పోలింగ్ వేళ ఫైర్ అయిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ..

ఇక్కడ బీజేపీ ఎలాగైన పాగావేయాలని విరించి ఆస్పత్రులు అధినేత్రి మాధవీలతను ఇక్కడ బరిలోకి దింపింది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, తమిళిసై, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ సైతం మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దేశ ప్రధాని మోదీ కూడా మాధవీలను తమ మద్దతు తెలపాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈక్రమంలో నిన్న మే 13న ఎన్నికలు జరిగాయి. అయితే.. ఉదయంమే మాధవీలత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనేక పోలింగ్ బూత్ లలో తిరుగుతూ ఎక్కడ కూడా రిగ్గింగ్, ఒకరికి బదులు మరోకరు ఓటు వేయకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. రియాసత్ నగర్ కు వెళ్లిన మాధవీలత అక్కడ ఉన్న మహిళ ఓటర్లను నఖాబ్ తీసి చెక్ చేశారు. వారి ఓటరుఐడీలను పరిశీలించారు. ఫెస్ రికగ్నిషన్ చేయకుండా ఎలా ఓటు వేయడానికి అనుమతిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు.

దీంతో కొందరు ముస్లిం మహిళా ఓటర్లు మాధవీలతపై సంతోష్ నగర్ పీఎస్ లో ఫిర్యాదులు చేశారు. మాధవీలత మాత్రం.. కార్వాన్, చార్మీనార్ బహద్దూర్ పూరా ఓల్గ్ సిటీలోని ఓటింగ్ కేంద్రాలలో సుడిగాలిపర్యటన చేశారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం.. ఐదుగంటల వరకు.. పోలింగ్ శాతం 35 గా ఈసీ వెల్లడించింది. ఇక చివరి గంటలో ఏకంగా 14 శాతం ఓటింగ్ పడిందని ఈసీ వెల్లడించింది. దీనిపై బీజేపీ మాధవీలత మండిపడ్డారు. చివరి గంటలో పద్నాలుగా శాతం ఎలా సాధ్యమౌతుందని ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Read more: Telangana Loksabha polls 2024: అయ్యో ఎంత ఘోరం.. ఎన్నికల విధుల్లో ఉండగా హర్ట్ ఎటాక్.. ఎక్కడంటే..?

ముఖ్యంగా.. కార్వాన్, చార్మినార్, బహాద్దూర్ పూర లలో గేట్లు వేసి మరీ మజ్లీస్ పార్టీ వారు రిగ్గింగ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లీస్ నేతలు.. పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారని, వారి ఏజెంట్ లు రిగ్గింగ్ లకు పాల్పడ్డారంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాధవీలత తెలిపారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఓల్డ్ సిటీలోని అనేక కేంద్రాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ విధుల్లో ఉన్న అధికారులకు ఘటనలపై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికల ఘటన మాత్రం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News