KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

KT Rama Rao Received Invitation: అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతిష్టాత్మక సదస్సుల ఆహ్వానం లభిస్తున్నాయి. వివిధ అంశాలపై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా మరో ఆహ్వానం దక్కగా కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండడంతో కేటీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లడం సందేహాస్పదంగా ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2024, 10:44 PM IST
KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

KT Rama Rao: అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కేటీఆర్‌ ఎన్నో ప్రతిష్టాత్మక వేదికల్లో పాలు పంచుకుని తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వాగ్ధాటి, అన్ని అంశాలపై సమగ్ర అవగాహన, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండడంతో ప్రఖ్యాత సంస్థలన్నీ కేటీఆర్‌కు ఆహ్వానం పలికాయి. అయితే అధికారం కోల్పోయి మాజీ మంత్రిగా మిగిలినా కూడా కేటీఆర్‌కు ప్రపంచ వేదికలపై ప్రసంగించేందుకు ఆహ్వానాలు అందుతుండడం విశేషం. ఇప్పటికే చెన్నైలో జరిగే ఓ ప్రతిష్టాత్మక సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం దక్కగా.. తాజాగా అమెరికాలో మరో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించింది.

Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌

 

అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు  హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13వ తేదీన జరగనున్న ఈ సదస్సులో 'భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొనాలని ఆహ్వానంలో ఉంది. తెలంగాణలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షణకు చేసిన విధానాలు, సాధించిన విజయాలను సదస్సులో వివరించి స్ఫూర్తి నింపాలని ఆ విశ్వవిద్యాలయం కేటీఆర్‌ను కోరింది.

Also Read: KCR: గుర్రాన్ని వదిలి ప్రజలు గాడిదను తెచ్చుకున్నారు: రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఎద్దేవా

ఈ మేరకు కేటీఆర్‌కు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎగ్సిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి లేఖ రాశారు. అమెరికాలోని ఇవాన్ స్టన్‌లో 1908లో నెలకొల్పిన ఈ బిజినెస్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ బిజినెస్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో నిలిచిందని ఆమె లేఖలో వివరించారు. భారత పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలు, క్షేత్రస్థాయిలో సవాళ్లు అంశంపై చర్చించేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను, విధానాల రూపకల్పనలో అనుభవం కలిగిన నాయకులను ఒకే వేదికపై చేర్చాలనే ఆలోచనతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు లేఖలో శ్వేత వెల్లడించారు. 

అయితే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో కేటీఆర్‌ హాజరుకావడం సందేహాస్పదంగా ఉంది. తన చెల్లెలు కల్వకుంట్ల కవిత అరెస్ట్‌తో ప్రస్తుతం ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనికితోడు క్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేటీఆర్‌ అమెరికా పర్యటన చేయకపోవచ్చని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News