Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. లబోదిబోమంటున్న రైతులు

Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అకాలవర్షం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ భారీ వర్షం వల్ల రోడ్లు అన్ని జలయం అవడంతో వాహనదారులకు త్రీవ  ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 11:28 PM IST
Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. లబోదిబోమంటున్న రైతులు

Heavy Rains in Telangana: భారీ వర్షాలతో బాన్సువాడలో రోడ్లన్నీ జలమయమయి డ్రైనేజీ నీరు రహదారిపై ప్రవహించడంతో వాహనదారులు త్రీవమైన ఇక్కట్లు ఎదుర్కొన్నారు. బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు గంటపాటు వడగళ్లతో కూడిన కుండపోత వర్షం పడింది. వడగళ్ల వర్షానికి తడిసిన ధాన్యం కుప్పలు తడిసి జలమయమయ్యాయి. వడగళ్లు కురవడంతో తడిసిన ధాన్యంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వడగళ్ళ వాన కురిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జల్దిపల్లి, వెలుట్లలో వడగళ్ల వానకు పంట తీవ్రంగా నష్టం వాటిల్లింది. కరెంట్ అంతారాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం గ్రామం మల్లుపల్లిలో ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటల వరి ధాన్యం అకాల వర్షాలతో నేల రాలి పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తo చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు రాళ్లు పడి పంట చేన్లు నష్టపోయామని.. అలాగే, ఐకేపి సెంటర్లో వరి ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం పండించుకున్న వరి ధాన్యం నేలపాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలస్యం లేకుండా ఐకెపి సెంటర్ ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు

ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లు, అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. నోటికాడికి వచ్చిన పంట చేతికి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మక్కలు వరద నీటి పాలయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. పంటలే కాకుండా రేకులతో నిర్మించిన ఇళ్లు వడగండ్ల వానకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు సైతం కూలిపోయాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Trending News