Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకే

Realme Budget Phones: ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో రియల్ మి సంస్థకు ప్రత్యేక స్థానముంది. ఎంట్రీ లెవెల్ నుంచి ప్రీమియం మోడల్స్ వరకూ అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లకు మంచి ఆదరణ లభిస్దోంది. తాజాగా మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2024, 02:43 PM IST
Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకే

Realme Budget Phones: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి ఇటీవలి కాలంలో ఎంట్రీ లెవెల్ ఫోన్లపై దృష్టి సారించింది. తాజాగా మరో అప్‌డేట్ జారీ చేసింది. కేవలం 10 వేల రూపాయలకే  5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. Realme C65 5Gపేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. 

రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి. రియల్ మి లాంచ్ చేస్తున్న ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా యాంటీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. రెయిన్ వాటర్ టచ్ కూడా మరో ప్రత్యేకతగా ఉండనుంది. 

ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రియల్ మి సి65 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక కెమేరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.

ఇది కాకుండా రియల్ మి నార్జో 70ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఏప్రిల్ 24వ తేదీన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రానుంది. ఈ ఫోన్ 12 వేల కంటే తక్కువకే అందుబాటులో ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే రియల్ మి నుంచి రియల్ మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇవన్నీ ఎంట్రీ లెవెల్ ఫోన్లు కావడంతో ధర చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. 

Also read: Nomination Rules: నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News