Realme P1 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ Realme P1 5G మొబైల్‌పై భారీ తగ్గింపు!

Realme P1 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme P1 5G, Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీఫ్ ధరలకే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 1, 2024, 04:52 PM IST
Realme P1 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ Realme P1 5G మొబైల్‌పై భారీ తగ్గింపు!

 

Realme P1 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ మార్కెట్‌లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తూ వస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన  కొన్ని సిరీస్‌ల మొబైల్స్‌కి మంచి ప్రజాదరణ లభించడంతో ఇటీవలే P1 సిరీస్‌లో కొత్త మొబైల్‌ లాంచ్ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో Realme P1 5G, Realme P1 Pro 5G అనే పేర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,499తో లభిస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి  రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు ప్రత్యేమై కూపన్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ధర రూ.15,999తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి స్మార్ట్‌ఫోన్‌ మరింత తక్కువ ధరలకు లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఇక Realme P1 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌  6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే ఈ డిస్ప్లే 1200 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ డిప్లేలో రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు మినీ క్యాప్సూల్ 2.0 కూడా లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌ వివరాలు:
MediaTek Dimension 7050 చిప్‌సెట్ ప్రాసెసర్‌
50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 
2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ కెమెరా 
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ 
45 Watt Supervooc ఛార్జింగ్‌
Android 14 ఆధారంగా Realme UI 5.0
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌
మూడు సెక్యూరిటీ ప్యాచ్‌లు
USB 2.0 వంటి కనెక్టివిటీ

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News