Poco X5 Pro 5G: అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌.. నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్! ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే

Poco 5G Smartphones, Poco X5 Pro 5G Smartphone launch in India. పోకో ఎక్స్5 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999లుగా ఉంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 7, 2023, 01:59 PM IST
  • అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌
  • నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్
  • ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే
Poco X5 Pro 5G: అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌.. నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్! ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే

Poco X5 Pro 5G Smartphone 2023, Poco 5G Smartphones under Rs 25000: చైనీస్ మొబైల్ కంపెనీ 'పోకో'కు భారతదేశంలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమ కస్టమర్ల కోసం పోకో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే పోకో ఎక్స్5 ప్రో 5జీ (Poco X5 Pro 5G)ని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ విజన్, స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్, 67W ఫాస్ట్ ఛార్జర్, స్టీరియో స్పీకర్లు మరియు అమోల్డ్ డిస్‌ప్లే లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ధర కూడా చాలా తక్కువగా ఉంది. ఈ ఫోన్ చాలా స్టైలిష్‌గా ఉంది. పోకో ఎక్స్5 ప్రో 5జీ ధర మరియు ఫీచర్లను ఇప్పుడు చూద్దాం. 

Poco X5 Pro Specifications:
పోకో ఎక్స్5 ప్రో పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్‌తో.. 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పోకో స్మార్ట్‌ఫోన్‌లలో అత్యంత సన్నని ఫోన్. ఈ ఫోన్ మూడు రంగులలో (పసుపు, నలుపు, నీలం) అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అందించబడుతుంది. 

Poco X5 Pro Camera:
పోకో ఎక్స్5 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 16MP కెమెరా ఉంది.

Poco X5 Pro Battery:
పోకో ఎక్స్5 ప్రో ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇది ఇటీవల లాంచ్ అయిన Realme 10 Pro+లో ఉన్న MediaTek Dimensity 1080 SoC కంటే వేగవంతమైనది. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దాంతో నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. 

Poco X5 Pro Price In India:
పోకో ఎక్స్5 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999లుగా ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 24,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌పై కస్టమర్‌కు 2 వేల రూపాయల తగ్గింపు ఇవ్వబడుతుంది. అప్పుడు ఈ ఫోన్ ధర రూ.20,999కి తగ్గనుంది. ఈ ఫోన్ విక్రయం ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానుంది.

Also Read: Sreeleela Pics: చుడీదార్‌లో శ్రీలీల.. మరీ ఇంత అందమా అంటూ పిచ్చెక్కిపోతున్న ఫాన్స్!

Also Read: Shraddha Das Hot Pics: సిల్వర్ శారీలో శ్రద్ధా దాస్.. చాలా శ్రద్దగా నెలవంక నడుమును చూపిస్తూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News