Poco M6 Pro 5G Price: హోలీ సందర్భంగా 128GB స్టోరేజ్‌ Poco M6 Pro 5G మొబైల్‌ కేవలం రూ.599కే.. పూర్తి వివరాలు!

Poco M6 Pro 5G Price Dropped: హోలీ సందర్భంగా ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 23, 2024, 11:12 AM IST
Poco M6 Pro 5G Price: హోలీ సందర్భంగా 128GB స్టోరేజ్‌ Poco M6 Pro 5G మొబైల్‌ కేవలం రూ.599కే.. పూర్తి వివరాలు!

Poco M6 Pro 5G Price Dropped: హోలీ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ప్రత్యేకమైన సేల్స్‌ ప్రారంభమయ్యాయి. అన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో ప్రీమియం బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే అతి చౌకగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన ఛాన్స్‌గా చెప్పొచ్చు. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు హోలీ పండగ సందర్భంగా ఈ మొబైల్‌ అత్యధికమైన ఫ్లాట్‌ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఈ POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో ఆరు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.15,999లకు లభిస్తోంది. అయితే హోలీ ప్రత్యుకమైన సేల్‌లో భాగంగా 38 శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌లో భాగంగా EMI ఆప్షన్‌ చూస్ చేసుకుని ఏదైన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.784 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్ ఆఫర్స్‌ పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.9,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.599కే పొందవచ్చు. అలాగే మరిన్ని ఆఫర్స్‌ పొందడానికి అధికారిక అమెజాన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

పోకో ఎం6 5G స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ 10 ఫీచర్స్‌:
శక్తివంతమైన 5G కనెక్టివిటీ, మెరుగైన పనితీరు కోసం MediaTek Dimensity 810 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.58 అంగుళాల FHD+ డోట్‌ డిస్‌ప్లేతో రాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయడానికి 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8MP సెల్ఫీ కెమెరాలు లభిస్తాయి. అలాగే త్వరగా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. మల్టీటాస్కింగ్‌ కోసం ఈ మొబైల్‌ 3GB/4GB/6GB ర్యామ్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇక ఈ  మొబైల్‌ స్టోరేజ్‌ ఆప్సన్స్‌ వివరాల్లోకి వెళితే, 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు సురక్షితమైన అన్‌లాక్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తోంది. అలాగే ఇది MIUI 13 ఆధారంగా Android 12పై పని చేస్తుంది. 

అదనపు ఫీచర్స్:
IR బ్లాస్టర్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
Hi-Res ఆడియో
డ్యూయల్ స్పీకర్లు
IP53 వాటర్ రెసిస్టెన్స్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News