Oppo A78 Price Cut: అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌ ధరకే కొత్త Oppo A78 మొబైల్‌ను పొందండి.. పరిమితకాల ఆఫర్‌..

Oppo A78 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ Oppo A78 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో అందిస్తోంది. అంతేకాకుండా  ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 15, 2024, 12:23 PM IST
Oppo A78 Price Cut: అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌ ధరకే కొత్త Oppo A78 మొబైల్‌ను పొందండి.. పరిమితకాల ఆఫర్‌..

Oppo A78 Price Cut: ఒప్పో స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కొత్త మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒటీవలే విడుదల చేసిన Oppo A78 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో దీనిపై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌, ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ Oppo A78 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 5జీ వేరియంట్‌ రూ.21,999తో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌ను భారీ తగ్గింపుతో పొందడానికి అమెజాన్‌ లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌ను కూడా అందిస్తోంది. ఈ డీల్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 18 శాతం వరకు తగ్గింపుతో కేవలం రూ.17,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ డీల్‌లో భాగంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,799 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ICICI, HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్ చేసిన దాదాపు రూ.1,799 డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై కూడా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  
   
దీంతో పాటు అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.17,050 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం ఈ మొబైల్‌ రూ.949కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు పొందవచ్చు. దీని కోసం అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఒప్పో A78 టాప్‌ 10 ఫీచర్స్‌, స్పెసిఫికేషన్లు:
ఫీచర్స్:

6.56-అంగుళాల LCD డిస్‌ప్లే: 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్పష్టమైన వీడియో అనుభవాన్ని అందిస్తుంది.
మల్టీటాస్కింగ్, గేమింగ్ కోసం శక్తివంతమైన Qualcomm Snapdragon 680 ప్రాసెసర్
యాప్‌లు, ఫైల్‌ల కోసం 8GB RAM + 128GB స్టోరేజ్
అద్భుతమైన ఫోటోలు, వీడియోల కోసం 48MP డ్యూయల్ రియర్ కెమెరా
స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరా
రోజంతా ఉండే బ్యాటరీ లైఫ్ కోసం 5000mAh బ్యాటరీ
త్వరగా ఛార్జ్ చేయడానికి 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌
తాజా Android ఫీచర్‌లతో Android 12
ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి In-display ఫింగర్‌ప్రింట్ సెన్సార్
నీటి నుంచి రక్షణ కోసం IPX4 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News