OnePlus 11 5G Price 2023: డెడ్ చీప్‌గా వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఏకంగా 25 వేల డిస్కౌంట్!

Get OnePlus 11 5G Smartphone only Rs 31999 in Amazon. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్‌లో భారీ ఆఫర్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే వన్‌ప్లస్ 11 5జీ కొనుగోలుపై రూ. 25000 ఆదా చేసుకోవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 17, 2023, 01:02 PM IST
OnePlus 11 5G Price 2023: డెడ్ చీప్‌గా వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఏకంగా 25 వేల డిస్కౌంట్!

Buy OnePlus 11 5G just Rs 31999 in Amazon: భారత మార్కెట్‌లో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'వన్‌ప్లస్'కి మంచి డిమాండ్ ఉంది. నిత్యం నూతన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే 'వన్‌ప్లస్' సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల విడుదల చేసింది. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) భారతీయ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. హై-ఎండ్ కేటగిరీలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది. చాలా మంది వన్‌ప్లస్ 11 5జీని కొనాలని చుస్తున్నారుకా. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క భారీ ధర కారణంగా సామాన్యులు కొనలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఓ అద్భుత అవకాశం ఉంది. 

OnePlus 11 5G Exchange Offer:
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్‌లో భారీ ఆఫర్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే వన్‌ప్లస్ 11 5జీ కొనుగోలుపై రూ. 25000 ఆదా చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 11 5జీ ధర ప్రస్తుతం రూ. 56999. కానీ అమెజాన్‌లో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 25000 వరకు ఆదా చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 11 5జీపై అమెజాన్‌లో 25 వేల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత మొబైల్ కండిషన్ బాగుంది, లేటెస్ట్ మోడల్ అయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. అలానే మీ మొబైల్ ఎలాంటి డామేజ్ లేకుండా ఉండాలి. అప్పుడు మీకు ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 31999కి మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

OnePlus 11 5G Price:
అమెజాన్‌లో ఈ అద్భుత ఆఫర్ కేవలం పరిమిత రోజులు మాత్రమే ఉంది. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. రూ. 56999 ఈ ఆఫర్ ద్వారా మీకు రూ. 31999 వస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కాకుండా వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవి మీరు అమెజాన్‌లో చెక్ చేసుకోవచ్చు. 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.59,999లుగా ఉంది. 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 66,999గా ఉంటుంది.

OnePlus 11 5G Features:
# 6.7 అంగుళాల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో అమోల్డ్ QHD డిస్‍ప్లే
# 120Hz రిఫ్రెష్ రేట్
# క్వాల్‍కామ్ పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్‍
# 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు
# 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 
# 5000mAh బ్యాటరీ
# 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

Also Read: Tata Nexon Vs Maruti Fronx: టాటా నెక్సాన్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో లేవు.. కొనేప్పుడు ఇవి చూసుకోండి!

Aslo Read: Mahindra Thar Price Hike 2023: మహీంద్రా థార్ కొనేవారికి షాక్.. ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన ధర!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News