భారత్ లో ఐ ఫోన్లను తయారు చేయనున్న టాటా..

టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను తయారు చేయనుందని ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం టాటా గ్రూప్ ఐఫోన్‌ల తయారీని ప్రారంభిస్తుందని ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 06:48 PM IST
భారత్ లో ఐ ఫోన్లను తయారు చేయనున్న టాటా..

ఆపిల్ తయారీ సంస్థ నుండి వచ్చే ఏ ఉత్పత్తి కైనా మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఏంటంటే.. కొంత మంది ఆపిల్ నుండి వచ్చే ప్రాడక్ట్ ల కోసం కొన్ని నెలలు, సంవత్సరాల వరకు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఒకసారి విడుదలైనా.. లేక అడ్వాన్స్ బుకింగ్ ఉన్న సరే.. క్షాణాల్లో అవయిపోవటం చూస్తాం. 

ముఖ్యంగా ఆపిల్ నుండి వచ్చిన ఐఫోన్.. ప్రజల్లో ఐ ఫోన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్వాలిటీ పరంగా, పనితీరు కానీ.. అద్భుతం అని చెప్పవచ్చు. ఇక ఐ ఫోన్  మొదట్లో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వాళ్ళం.. కానీ ఇపుడు థర్టీ పార్టీ సంస్థల ద్వారా మన దేశంలో తయారు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. 

కానీ ఐ ఫోన్  ప్రియులకు శుభవార్త ఏంటంటే.. ఇక నుండి భారత్ లోనే ఐ ఫోన్ తయారు చేయటం మరియు ఇతర దేశాలకు ఎగుమతులు కూడా జరగనున్నాయి. ఇప్పటి థర్డ్ పార్టీ సంస్థలు ఐ ఫోన్ తయారు చేయగా.. ఇపుడు టాటా సంస్థ ఐ ఫోన్ తయారీ మరియు ఎగుమతులు  నిర్వచించనున్నట్లు సమాచారం.. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రకారం., టాటా గ్రూప్ త్వరలో భారత్‌లో ఐఫోన్‌ను తయారు చేయనుంది . టాటా గ్రూప్ రెండున్నరేళ్లలో దేశీయ , ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని తెలిపారు. టాటా గ్రూప్‌తో విస్ట్రాన్ ఫ్యాక్టరీ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే అని ట్విట్టర్లో పేర్కొన్నారు. 

Also Read: JD Lakshminarayana: ఏపీ సీఎం జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సీబీఐ మాజీ అధికారి

ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం చేసిన ట్వీట్ లో.. పీఎం నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన PLI పథకం.. భారతదేశాన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ మరియు ఎగుమతులకు విశ్వసనీయ మరియు ప్రధాన కేంద్రంగా మార్చింది.కేవలం రెండున్నరేళ్లలోపే.. టాటాకంపెనీలు భారతదేశం నుండి దేశీయ మరియు ప్రపంచ మార్కెట్లొకి ఐఫోన్‌లను తయారు చేయడం ప్రారంభిస్తుంది. విస్ట్రాన్ కార్యకలాపాలను చేపట్టినందుకు టాటా బృందానికి అభినందనలు అని తెలిపారు. 

Also Read: Onion Price Hike: ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో కిలో 60 రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News