iPhone 13 Flipkart Price: ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. ఐఫోన్ 13పై రూ. 10900 తగ్గింపు! నేటితో ఆఫర్ ముగింపు

Get iPhone 13 5G Smartphone Rs 58999 in Flipkart. ఐఫోన్ 13పై ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండానే  ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,900 తగ్గింపు పొందవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 18, 2023, 02:00 PM IST
iPhone 13 Flipkart Price: ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. ఐఫోన్ 13పై రూ. 10900 తగ్గింపు! నేటితో ఆఫర్ ముగింపు

Apple iPhone 13 Flipkart Offers 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' తన ప్లాట్‌ఫారమ్‌లో ఎప్పటికప్పుడు సేల్స్ నిర్వహిస్తుంటుంది. బిగ్ బిలియన్ డేస్, బిగ్ సేవింగ్ డేస్, దీపావళి సేల్, దసరా సేల్, బిగ్ బచాత్ ధమాల్ సేల్ లాంటివి నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'సమ్మర్ సేల్‌'ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా 5G ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. వాటిలో యాపిల్ ఐఫోన్ 13 కూడా ఒకటి. అయితే ఈ సేల్ ఈవెంట్ ఈ రోజు రాత్రికి ముగుస్తుంది. కాబట్టి వినియోగదారులకు ఈ 5G ఫోన్‌ను అందుబాటులో ఉన్న ధరకు (iPhone 13 Flipkart Price) కొనుగోలు చేసే చివరి అవకాశం ఉంది. ఐఫోన్ 13పై ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండానే రూ. 10,900 తగ్గింపు పొందవచ్చు. 

iPhone 13 Offer: 
ఐఫోన్ 13 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 58,999 ప్రారంభ ధరతో ఉంది. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో దీని అసలు రిటైల్ ధర రూ. 69,900లుగా ఉంది. అంటే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ దీనిపై రూ. 10,901 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది. ఈ ఆఫర్ ఏ బ్యాంక్ ఆఫర్‌పై ఆధారపడి లేదు. ఫ్లిప్‌కార్ట్ నేరుగా ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను ఇస్తోంది. అయితే ఈ సేల్ ఆఫర్ ఈరోజు రాత్రి 12 వరకు అందుబాటులో ఉంటుంది.

iPhone 13 Exchange Offer:
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 1,000 తగ్గింపు ఉంది. ఆఫర్ తర్వాత ఐఫోన్ 13 ధర రూ. 57,999లుగా ఉంటుంది. ఈ ఆఫర్ ధర 128GB స్టోరేజ్ మోడల్‌పై మాత్రమే ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 13 కొనుగోలుపై 26,250 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే మీ ప్రస్తుత ఫోన్ పనితీరు మరియు మోడల్ ఆధారంగా ఈ తగ్గింపు లెక్కించబడుతుందని గుర్తుంచుకోండి. మీ పాత ఫోన్ మోడల్ లేటెస్ట్ అయి ఉండి.. కండిషన్ బాగుంటే పూర్తి ఆఫర్ వర్తిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ దాదాపుగా రూ. 31 వేల వరకు వస్తుంది. 

iPhone 13 Features:
# 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
# ప్రధాన కెమెరా 12 మెగాపిక్సల్స్‌ (ఎంపీ)
#  స్టోరేజ్‌ (128జీబీ)
# ఏ15 బయానిక్‌ చిప్‌, ఐఓఎస్‌ 15
# 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ
# 3,227 ఎంఏహెచ్‌ బ్యాటరీ
# 20W ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ 

Also Read: Hyundai Creta Facelift Launch 2023: హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. బుకింగ్స్ మొదలు! ఫీచర్లు ఇవే

Also Read: MS Dhoni IPL Retirement 2023: ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోనీ కచ్చితంగా ఆడతాడు.. తేల్చేసిన చెన్నై స్టార్ ప్లేయర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News