Lava Agni 2 Launch: మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తోన్న లావా.. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెషాలిటీ తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!

Lava Agni 2 5G Smartphone come with a curved display. భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'లావా' తన అగ్ని సిరీస్‌లో మరో సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ పేరు 'లావా అగ్ని 2'.   

Written by - P Sampath Kumar | Last Updated : May 9, 2023, 08:39 PM IST
Lava Agni 2 Launch: మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తోన్న లావా.. ఈ  స్మార్ట్‌ఫోన్‌ స్పెషాలిటీ తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!

2023 Lava Agni 2 5G Launch in India: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'లావా' తన అగ్ని సిరీస్‌లో మరో సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ పేరు 'లావా అగ్ని 2'. ఈ స్మార్ట్‌ఫోన్‌ సరసమైన ధరకే కాకుండా.. మార్కెట్‌లో తమ శ్రేణిలో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇవ్వడానికి వస్తోంది. లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ డిజైన్ బాగా కనిపిస్తుంది. అగ్ని 2 స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ కాకముందే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిజైన్ మాత్రమే కాకుండా దాని ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లకు సంబంధించి సమాచారం బయటకు వచ్చాయి. 

లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌కు భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ లభించనుందని సమాచారం. ఈ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులు ఏమి పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతారు. ఇది సూపర్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది. ఈ కెమెరా సెటప్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ క్వాడ్ కెమెరా సెటప్‌తో లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్ డిజైన్ మరింత ప్రత్యేకంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కెమెరా సెటప్‌తో పాటు నైట్ ఫోటోగ్రఫీని మరింత మెరుగ్గా చేసే LED ఫ్లాష్ కూడా ఇందులో ఉంటుంది.

లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్ లోడ్ చేయబడిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోంది. ఇది సరసమైన ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది భారతీయ కస్టమర్ల జేబుకు చిల్లు వేయదు. ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 20 వేల రూపాయలు ఉండవచ్చని సమాచారం తెలుస్తోంది. అయితే సరైన సమాచారం వచ్చే వారం లావా అగ్ని 2 రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తెలియనుంది. అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులకు డబుల్ రీన్ఫోర్స్డ్ ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ అందించబడుతుంది. ఇది తదుపరి స్థాయి పనితీరు కోసం ఉపయోగపడుతుంది. దేశంలోనే ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.

లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ మరో సూపర్ కూడా కలిగి ఉండనుంది. కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఇవ్వబడుతుంది. 5000 బ్యాటరీ ఉండొచ్చని అంచనా. మొత్తం మీద ఈ ఫోన్ కస్టమర్లకు ప్రీమియం అనుభూతిని అందించే స్టైలిష్ మరియు హైటెక్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుంది. లావా కంపెనీలో ఈ అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ ఉంది కాబట్టి ఈ ఫోన్ అమ్మకాలు బాగానే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫీచర్స్ బాగున్నా.. లుకింగ్ బాగుంటే సక్సెస్ అవుతుంది. అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఉన్న అన్ని ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లావా కంపెనీ తన మార్క్ చూపేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరికొత్త ఫాన్స్ రిలీజ్ చేస్తోంది. 

లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్:
# మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్
# 50 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా
# నైట్ ఫోటోగ్రఫీ
# డబుల్ రీన్ఫోర్స్డ్ ప్రీమియం గ్లాస్
# కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే
# 5000 బ్యాటరీ 

Also Read: MI vs RCB: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! స్వదేశంకు ప్రయాణం  

Also Read: Cyclone Mocha Latest News: ఏపీ, తెలంగాణపై మోచా తుఫాన్ ప్రభావం ఉంటుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News