Happy Ugadi 2024: తెలుగులో ఉగాది శుభకాంక్షలు చెప్పిన సన్ రైజర్స్ ఆటగాళ్లు, వీడియో వైరల్

Happy Ugadi 2024: ఉగాది నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఢీకొనబోతుంది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు తెలుగు ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.  

Written by - Samala Srinivas | Last Updated : Apr 9, 2024, 06:38 PM IST
Happy Ugadi 2024: తెలుగులో ఉగాది శుభకాంక్షలు చెప్పిన సన్ రైజర్స్ ఆటగాళ్లు, వీడియో వైరల్

IPL-Sunrisers Hyderabad: మరికొన్ని గంటల్లో కీలకపోరుకు తెరలేవనుంది. ఉగాది నాడే సన్ రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) మొహాలీలో పంజాబ్ ను ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని కమిన్స్ సేన నెట్స్ తీవ్రంగా చెమటొడిస్తుంది. కొత్త సంవ‌త్స‌రాది అయిన ఉగాది సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు తెలుగు ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కొందరు ఆటగాళ్లు తెలుగులో ఉగాది విషెష్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ వీడియోలో మ‌యాంక్ అగ‌ర్వాల్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, మార్కో జాన్‌సెన్‌లు ఉన్నారు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలు క్రోధి నామ సంవత్సర ఉగాదిని జరుపుకుంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఆటతీరును కనబరుస్తోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన హైదరాబాద్ రెండింటిలో గెలిచి నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277 ప‌రుగులు)ను నమోదు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.  

ఇరు జట్లు ఫ్లేయింగ్ 11 ఇదే..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్, ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ , రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, ఉపేంద్ర యాదవ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఝటావేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూకీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్
పంజాబ్ కింగ్స్ జట్టు:  శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కుర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(w), హర్‌ప్రీత్ బ్రార్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, , విధ్వత్ కావరప్ప, లియామ్ లివింగ్‌స్టోన్, రిలీ రోసౌ, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, క్రిస్ వోక్స్, రిషి ధావన్, అథర్వ తైదే, శివమ్ సింగ్, ప్రిన్స్ చౌదరి, విశ్వనాథ్ సింగ్

Also Read:  Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. IPLలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్క ఫ్లేయర్ గా ఘనత..

Also Read: CSK vs KKR Highlights: కోల్‌కత్తా దూకుడుకు చెన్నై బ్రేక్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గట్టెక్కిన సీఎస్కే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News