Karnataka Cricketer: ఇండియన్ క్రికెట్ లో విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి..

Cricketer Hoysala death: యంగ్ క్రికెటర్ కె. హోయసల గుండెపోటుతో మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో తమిళనాడు, కర్ణాటక మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 09:45 PM IST
Karnataka Cricketer: ఇండియన్ క్రికెట్ లో విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి..

Cricketer Hoysala K Dies: ఇండియన్ క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కర్ణాటకకు చెందిన యువ క్రికెటర్ కె. హోయసల  గ్రౌండ్ లోనే ప్రాణాలు వదిలాడు. ఏజిస్ సౌత్ జోన్ టోర్నీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది కర్ణాటక జట్టును షాక్ కు గురి చేసింది. దీంతో అతడి కుటుంబంతోపాటు క్రీడాలోకం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది.  

ఏజిస్ సౌత్ జోన్ టోర్నీ భాగంగా... ఇవాళ కర్ణాటక జట్టు తమిళనాడుతో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కె. హోయసల అద్భుతమైన బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్ లో తమిళనాడును ఓడించి కర్ణాటక సంబరాలు చేసుకుంది. విజయం అనంతరం ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బంది మైదానంలో గుమిగూడారు. విజయానికి గల కారణాలు, తర్వాత మ్యాచ్ కు సంబంధించిన సన్నాహకాలపై చర్చిస్తున్నారు. ఇదే సమయంలో సహచర ఆటగాళ్లతో నిల్చున్న హోయసల ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్ది క్షణాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మైదానంలో ఉన్న వైద్యుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరిశీలించి అత్యవసర చికిత్స అందించారు. అక్కడి నుంచి హుటాహుటిన అంబులెన్స్‌లో బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. 

Also Read: IPL 2024 schedule: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ ఢీ..!

వైద్యులు అతడిని పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ కర్ణాటక టీమ్ ని షాక్ కి గురి చేసింది. తమిళనాడుపై కర్ణాటక గెలిచిన.. సహచర క్రికెటర్ చనిపోవడంతో సంబరాలు చేసుకోలేని స్థితి వారిది. ఆస్పత్రికి చేరుకున్న హోయసల కుటుంబ సభ్యులు అతడి మరణ వార్త విని పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. 

Also Read: CSK IPL Schedule 2024: ధోని, కోహ్లీ మధ్యే తొలి మ్యాచ్.. చెన్నై షెడ్యూల్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News