IPL Winning Teams: ఐపీఎల్ టైటిల్ ఏ జట్టు ఎప్పుడెప్పుడు ఎన్ని సార్లు గెల్చుకుందో తెలుసా

IPL Winning Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. కెప్టెన్ల మార్పు, ఆటగాళ్ల బదిలీలతో ఈసారి ఫ్రాంచైజీలు విభిన్నంగా కన్పించనున్నాయి. మరో జట్టయితే అదృష్టం మార్చుకునేందుకు పేరు మార్చుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2024, 06:02 AM IST
IPL Winning Teams: ఐపీఎల్ టైటిల్ ఏ జట్టు ఎప్పుడెప్పుడు ఎన్ని సార్లు గెల్చుకుందో తెలుసా

IPL Winning Teams: టీ20 ఫార్మట్ క్రికెట్‌తో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రపంచంలోనే ఎక్కడా లేని ఆదరణ వచ్చింది. భారీగా కాసులు కురిపిస్తున్న లీగ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటగాళ్ల సామర్ధ్యాన్ని బట్టి వెలకట్టే లీగ్ ఇది. ఓ విధంగా చెప్పాలంటే ఐపీఎల్ ప్రారంభమైనప్పట్నించి క్రికెట్ వేగం మారిపోయింది. 

ప్రపంచంలోని వివిధ క్రికెట్ జట్లలో మేటి ఆటగాళ్లంతా ఒకేచోట చేరి వివిధ ఫ్రాంచైజీల తరపున ఆడే ఆట ఇండియన్ ప్రీమియర్ లీగ్. దేశంలోని వివిధ నగరాలపేర్లతో ప్రారంభమైన ఫ్రాంచైజీలను బడా పారిశ్రామికవేత్తలు లేదా సంస్థలు లేదా సెలెబ్రిటీలు చేజిక్కించుకుని నడుపుతున్నాయి. పక్కా కమర్షియల్ లీగ్ ఇది. ఆటగాళ్ల పరిస్థితి కూడా అంతే. సామర్ధ్యం, ఆట తీరుని బట్టి వెల ఉంటుంది. బహిరంగ వేలంలో ఎవరి సత్తా ఎంటో పలికే ధరను బట్టి తెలిసిపోతుంది. కాసులు కురిపించే లీగ్ కావడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ జట్టు ఎన్నిసార్లు టైటిల్ గెలిచిందనేది తెలుసుకుందాం..

ఐపీఎల్ సీజన్ 1.. 2008లో ప్రారంభమైంది. మొదటి సారి రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ గెల్చుకుని అందర్నీ ఆకర్షించింది. ఆ తరువాత చాలా సందర్భాల్లో రాణిస్తూ వచ్చినా చివర్లో విఫలమై వెనుతిరిగిపోయేది. 

ఇక రెండవ ఏడాది ఇప్పటి సన్‌రైజర్స్ హైదరాబాద్ అప్పటి డెక్కన్ ఛార్జర్స్ జట్టు ట్రోఫీ గెల్చుకుని అందరి దృష్టిలో పడింది. తరువాత ఈ జట్టు టైటిల్ వరకూ రాలేకపోయింది. తరువాత పేరు మార్చుకుని సన్‌రైజర్స్ హైదరాబాద్ అయింది. యాజమాన్యం కూడా మారింది. 2016లో మరోసారి టైటిల్ గెల్చుకుని రెండు సార్లు టైటిల్ గెల్చుకున్న జట్టుగా మిగిలింది. ఈసారి ఆసీస్ మేటి ఆటగాళ్లను వేలంలో చేజిక్కించుకుని మూడోసారి టైటిల్ కొట్టేందుకు యోచిస్తోంది. 

ఆ తరువాత మూడోసారి అంటే 2010లో తొలిసారిగా టైటిల్ గెల్చుకున్న ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మరుసటి ఏడాది 2011లో కూడా టైటిల్ గెల్చుకుంది. తిరిగి 2018, 2021లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ 2023 టైటిల్‌తో ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ఖ్యాతినార్జించింది. ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. 

ఇక 2012 ఐపీఎల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ గెల్చుకుని టైటిల్ విజేతల జాబితాలో చేరింది. ఆ తరువాత 2014 టైటిల్ కూడా గెల్చుకుని రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా పేరు సంపాదించింది. 

ఇక ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్ గెల్చిన రికార్డుని తొలిసారి నెలకొల్పింది రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు కూడా. తొలిసారి 2013లో టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్  ఆ తరువాత 2015, 2017, 2019, 2020ల్లో టైటిల్ గెల్చి రికార్డు సాధించింది. 

ఇక 2022లో తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంగేట్రంలోనే టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. తరువాత 2023లో వరుసగా రెండోసారి ఫైనల్ వరకూ వెళ్లి ఆగిపోయింది. ఈసారి కెప్టెన్ మార్పుతో బరిలో దిగుతోంది. 

ఇక అత్యధిక సార్లు ఫైనల్ వరకూ లేదా ప్లే ఆఫ్స్ వరకూ చేరి టైటిల్ గెలవలేకపోయిన మరో మేటి జట్టు అత్యంత దురదృష్టకరమైన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పుకోవచ్చు. ఈసారి పేరు మార్చుకుని బరిలో దిగనుంది. పేరు మార్చుకోవడం ద్వారా అదృష్టం మారుతుందో లేదో చూడాలి. ఇక ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇంకా ఖాతా తెరవలేదు. 

Also read: IPL 2024 Updates: కప్ కొట్టాలనే కసితో ఆర్‌సీబీ.. కొత్త స్క్వాడ్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News