IPL 2024: చెన్నైకు భారీ షాక్.. ఐపీఎల్‌ మొదలుకాకముందే విధ్వంసక బ్యాటర్ దూరం..

IPL 2024: ఐపీఎల్-2024 ప్రారంభం కాకముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 09:26 AM IST
IPL 2024: చెన్నైకు భారీ షాక్..  ఐపీఎల్‌  మొదలుకాకముందే విధ్వంసక బ్యాటర్ దూరం..

IPL 2024 - Chennai Super Kings: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్‌ మెుదలవ్వకముందే భారీ షాక్ తగిలింది. చేతి వేలి గాయం కారణంగా న్యూజిలాండ్‌ స్టార్ క్రికెటర్‌ డేవాన్‌ కాన్వె ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో కాన్వే ఎడమ బొటన వేలికి గాయమైంది. దీంతో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌తో పాటు కంగూరు జట్టుతో జరగబోయే తొలి టెస్టుకు దూరమయ్యాడు కాన్వే. అతడు పూర్తిగా కోలుకునేందుకు ఎనిమిది వారాల సమయం పట్టే అవకాశముందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఆసీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడిన కాన్వేకు వైద్యులు ఎక్స్-రే, స్కానింగ్ చేశారు. రిపోర్టులు పరిశీలించిన డాక్టర్స్ సర్జరీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అతడు రికవర్ అవ్వడానికి ఎనిమిది వారాలు సమయం పట్టే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. దీంతో ఐపీఎల్ కు దూరమయ్యాడు కాన్వే. ఇతడిని 2022లో కనీస ధర కోటి రూపాయలకు కొనుగోలు చేసింది చెన్నై. ఇప్పటి వరకు సీఎస్కే తరపున 23 మ్యాచ్‌లాడి 46 సగటుతో 924 పరుగులు చేశాడు. కాన్వే త్వరగా కోలుకోవాలని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ ఆకాంక్షించారు. 

అతడి స్థానంలో..

ఆసీస్ తో జరగబోయే టెస్టుకు కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్‌ను వికెట్ కీపర్ గా తీసుకున్నారు. ఈసారి ఐపీఎల్ సీజన్ చెన్నై-బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ తో ఆరంభం కానుంది. ఈరెండు జట్ల మధ్య మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. కాన్వే గాయంపై సీఎస్కే  ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  గత సీజన్‌లో చెన్నై జట్టు టైటిల్ గెలవడంలో కాన్వే కీ రోల్ పోషించాడు. ఈ ఎడిషన్‌లో సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు జోడిగా కాన్వే స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. 

Also Read: IPL 2024: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ఖాయమేనా, ప్యాట్ కమిన్స్ దశ మార్చనున్నాడా

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఈ నేపథ్యంలో.. ఈ ఐపీఎల్-2024 సీజన్ రెండు దశల్లో జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 మధ్య మొదటి దశలో 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. 

Also Read: Gautam Gambhir: గౌతమ్ గంభీర్ అస్త్ర సన్యాసం అందుకేనా, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News