Weekly Rasi Phalalu: ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..

Weekly Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 17 నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు రాశి సంచారం చేయడం కారణంగా ఏర్పడిన ప్రత్యేక ప్రభావం ఈ రోజు నుంచి అన్ని రాశుల వారిపై పడబోతోంది. అయితే ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 17, 2024, 09:50 AM IST
Weekly Rasi Phalalu: ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..

Weekly Rasi Phalalu In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం కుంభ రాశిలో మార్చి 18వ తేదీన కదలికలు జరపబోతోంది దీనికి కారణంగా అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతుంది. కారణంగా ఈ వారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి నష్టాలు కలగవచ్చు. అలాగే ఈ వారం ఎంతో ప్రాముఖ్యత కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. అయితే ఈ శక్తివంతమైన యోగాల ప్రభావం కూడా అన్ని రాశుల వారిపై పడే ఛాన్స్. కాబట్టి ఈ వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 17 నుంచి 22 వరకు వార ఫలాలు:
మేషం (Aries):

ఈ వారం మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి వీరు ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. సానుకూల దృక్పథంతో ఉంటే వాటిని అధిగమించగలరు. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఆర్థికంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభం (Taurus):

ఈ వారం వృషభ రాశి వారు చాలా బిజీగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వారం వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (Gemini):

ఈ వారం మిథున రాశి వారికి చాలా అదృష్టంగా ఉంటుంది.   మీరు మీ పనిలో మంచి పురోగతి సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడమే కాకుండా ఎంతో ఆనందంతో ఉంటారు. ఆర్థికంగా కూడా ఈ వారం అనేక రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కర్కాటకం (Cancer):

ఈ వారం కర్కాటక రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు మీ ఆహారం, జీవనశైలిపై శ్రద్ధ వహించండి. దీంతోపాటు కర్కాటక రాశి వారికి పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వారం మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది..

సింహం (Leo):

సింహ రాశి వారు ఈ వారం ఎంతో శక్తివంతంగా ఉంటారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా ఈ వారం గడుపుతారు. దీంతోపాటు వీరికి ఈ వారం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

కన్య (Virgo):
కన్యా రాశి వారు ఈ వారం ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది.

తుల (Libra):
తులా రాశి వారికి ఈ వారం చాలా కలిసి వస్తుంది. దీనికి కారణంగా వీరికి అదృష్టం పెరిగి ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొత్త స్నేహితులతో స్నేహాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పనిలో పురోగతి లభించడమే కాకుండా ప్రమోషన్స్ కూడా పొందుతారు.

వృశ్చికం (Scorpio):
ఈవారం వృశ్చిక రాశి వారికి శృంగార భరితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం కొనసాగిస్తున్న వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరేందుకు ఇది సరైన సమయంగా భావించవచ్చు.

ధనస్సు (Sagittarius):

ఈ వారం కుంభ రాశి వారికి అదృష్టం ఒక్కసారిగా పెరగబోతుంది. దీని కారణంగా వీరు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించడమే, కాకుండా డబ్బును కూడా పొందుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్టు లభించి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా కూడా ఈ వారం చాలా కలిసి వస్తుంది.

మకర (Capricorn):
మకర రాశి వారు ఈ వారం చాలా బిజీ బిజీగా ఉంటారు. దీని కారణంగా పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో మంచిది.. అంతేకాకుండా ఈ వారం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆర్థిక విషయానికి వస్తే వీరికి ఈ వారం చాలా బాగుంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

కుంభం (Aquarius):
కుంభ రాశి వారు ఈ వారం ఎంతో స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉంటారు. శని ప్రభావం కారణంగా వీరికి అనుకున్న పనులన్నీ సులభంగా జరిగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో బాగుంటుంది. మీరు అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.

మీనం(Pisces):
మీన రాశి వారికి కూడా ఈ వారం అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో అదృష్టం పెరిగి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తారు. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దీని కారణంగా ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News