Shukra Gochar 2024: కుంభరాశిలో శుక్రుడు- శని కలయిక.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..

Venus transit 2024: వచ్చే నెల 07న శుక్రుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కుంభరాశిలో శని మరియు శుక్రుడు కలయిక సంభవించబోతుంది. ఇది నాలుగు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ను అందించబోతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 01:09 PM IST
Shukra Gochar 2024: కుంభరాశిలో శుక్రుడు- శని కలయిక.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..

Shani-Shukra Yuti 2024 effect: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన కదలికను మారుస్తుంది. గ్రహాల గమనంలో మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం న్యాయదేవుడైన శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 07న ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీంతో కుంభరాశిలో శుక్రుడు మరియు శని కలయిక ఏర్పడబోతుంది. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. 

కుంభరాశి
ఇదే రాశిలో శుక్రుడు మరియు శని మైత్రి ఏర్పడబోతుంది. దీని కారణంగా మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
వృషభ రాశి
శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి ఈ సమయంలో శుభవార్తను ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. 
తులా రాశి
కుంభరాశిలో శుక్రుడు, శని గ్రహాల కలయిక వల్ల తులారాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఉద్యోగులకు సీనియర్ల నుండి సపోర్టు లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. 
మకర రాశి
శుక్ర మరియు శని సంయోగం మకర రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ ఆర్థికంగా లాభపడతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారస్తులు ప్రయోజనం పొందబోతున్నారు.

Also Read: Lunar Eclipse 2024: హోలీనాడే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అత్యంత ప్రమాదరకరమైన సమయం..

Also Read: Astrology:కుంభరాశిలోకి అపూర్వ గ్రహ యోగం.. ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News