Budh Gochar 2023: రేపటి నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి.. ఎందుకో తెలుసా?

Budh Gochar 2023: అక్టోబర్ 18వ తేదీన బుధ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఇంతకుముందు ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఈ సంచార ప్రభావం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 07:18 PM IST
 Budh Gochar 2023: రేపటి నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి.. ఎందుకో తెలుసా?

Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా 12 రాశుల వారి వ్యక్తిగత జీవితంపై ప్రతికూల, సానుకూల ప్రభావాలు పడతాయి. అయితే ఈ ప్రభావాలు గ్రహాలకు కదలికలను బట్టి ఉంటుంది. జాతకంలో గ్రహం అనుకూల స్థానంలో ఉంటే వ్యక్తిగత జీవితం మంచి ప్రయోజనాలు కలుగుతాయి.. అదే ప్రతికూల స్థానంలో ఉంటే ఊహించని నష్టాలతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

అక్టోబర్ 19వ తేదీన బుధుడు తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలు జరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎవరి జాతకంలోనైతే బుధుడు అనుకూల స్థానంలో ఉంటాడు వారికి ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అదే జాతకంలో బుధుడు ప్రతికూల స్థానంలో ఉంటే సమస్యలు మొదలవుతాయని వారు అంటున్నారు. బుధుడి సంచారం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

బుధుడి సంచారం కారణంగా మేష రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగాలు చేసే ఈ రాశి వారు ఈ సమయంలో ప్రమోషన్స్ పొందుతారు. అంతేకాకుండా విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు కూడా అనేక రకాల లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి.. వైవాహిక జీవితంలో ప్రశాంతత లేని వారు ఈ సమయంలో ఊహించని ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మేష రాశి వారు ఈ సమయం కుటుంబంతో గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు వీరు సమాజంలో మంచి గౌరవం ప్రతిష్ట కూడా పొందుతారు.

కన్యా రాశి వారికి కూడా ఈ బుధుడి సంచారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది వీరు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం చెందుతారు అంతేకాకుండా ఆగిపోయిన డబ్బు కూడా సులభంగా పొందుతారు. ఇక ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ సమయంలో వీరు గౌరవప్రదమైన జీవితం గడపడమే కాకుండా ప్రమోషన్స్ కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా ఎప్పుడూ ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఈ సమయంలో వీరికి తోటి స్నేహితుల మద్దతు లభించి అనేక రకాల లాభాలు పొందుతారు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News