Gorilla Smartphone: స్మార్ట్ ఫోన్ వదలలేకపోతున్న గొరిల్లా.. తలలు పట్టుకుంటున్న అధికారులు!

Gorilla addicted to Smartphone. అమెరికాలోని చికాగో జూలో ఉన్న అమేర్‌ అనే గొరిల్లాకు స్మార్ట్ ఫోన్ ఓ వ్యసనంగా మారింది. ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ చూస్తూనే గడిపేస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 11:16 PM IST
  • స్మార్ట్ ఫోన్ వదలలేకపోతున్న గొరిల్లా
  • తలలు పట్టుకుంటున్న చికాగో జూ అధికారులు
  • స్మార్ట్‌ ఫోన్‌ను గొరిల్లాకు దూరం చేయకుండా
Gorilla Smartphone: స్మార్ట్ ఫోన్ వదలలేకపోతున్న గొరిల్లా.. తలలు పట్టుకుంటున్న అధికారులు!

US zoo Gorilla Amare addicted to Smartphone: మొబైల్ ఫోన్‌.. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. అందుకే ఫోన్‌ చూడనిదే ఇప్పుడు ఎవరికైనా రోజు గడవడం లేదు. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు స్మార్ట్ ఫోన్ ఓ వ్యసనంగా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. వీడియోలు చూస్తూనో, పాటలు వింటూనో కొందరు గడిపేస్తుంటే..ట్విటర్, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లతో ఇంకొందరు కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్ ఫోన్‌కు కేవలం మనుషులే కాదు జంతువులు కూడా అడిక్ట్ అవుతున్నాయి.

స్మార్ట్ ఫోన్‌కు ఓ గొరిల్లా అడిక్ట్ అయింది. ఆ అలవాటు నుంచి సదరు గొరిల్లా.. దాని నుంచి బయటపడలేకపోతోంది. అమెరికాలోని చికాగో జూలో ఉన్న అమేర్‌ అనే గొరిల్లాకు స్మార్ట్ ఫోన్ ఓ వ్యసనంగా మారింది. ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ చూస్తూనే గడిపేస్తోంది. దాంతో ఆ అలవాటు ఎలా మాన్పించాలా అని జూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు గొరిల్లాకు స్మార్ట్‌ ఫోన్ ఎక్కడిదని మీకు అనుమానం రావొచ్చు?. అసలు విషయంలోకి వెళితే...

అమెరికాలోని జూలలో జంతువులను చూసేందుకు సందర్శకుల కోసం గ్లాస్‌ కిటకీలు ఏర్పాటు చేశారు. దాంతో జూకు వచ్చిన సందర్శకులు గొరిల్లాతో సెల్ఫీలు తీసుకున్నారు. అంతేకాదు దానికి వీడియోలు చూపిస్తూ స్మార్ట్ ఫోన్‌ను అలవాటు చేశారు. మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత గొరిల్లాకు ఇదో అలవాటుగా మారిపోయింది. తోటి గొరిల్లాలు తనపై దాడి చేస్తున్నా.. పట్టించుకోనంతగా స్మార్ట్‌ ఫోన్‌లో అది లీనమైపోతోంది. అంతలా అంటే.. ఫోన్ చూడని రోజు ఆ గొరిల్లా అదోలా ఉంటోంది. 

ఈ విషయం గమనించిన జూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకేసారి స్మార్ట్‌ ఫోన్‌ను గొరిల్లాకు దూరం చేయకుండా.. దానికి స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తున్నారు. వీడియోలు చూపించేందుకు ప్రయత్నిస్తున్న సందర్శకులకు అసలు సమస్యను వివరిస్తున్నారు. వారు ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్‌ను గొరిల్లాకు చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో నెమ్మదిగా ఆ గొరిల్లాకు స్మార్ట్ ఫోన్‌ను వ్యసనంను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి. 

Also Read: Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్

Also Read: Allu Arjun: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్‌.. అసలు కారణం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News