Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..

Boy skating Viral: యువకుడు రోడ్డుమీద స్కెటింగ్ చేస్తున్నాడు. ఇంతలో అతనికి రోడ్డుమీద ఒక కారు కన్పించింది. ఎలాగైన దాన్ని పట్టుకొవాలని ప్లాన్ చేశాడు. స్పీడ్ గా దాని దగ్గరకు వెళ్లికారు వెనుక భాగం పట్టుకొవాలని చూశాడు.

Written by - Inamdar Paresh | Last Updated : May 13, 2024, 06:59 PM IST
  • రోడ్డుపైన డెంజర్ స్టంట్..
  • ఇదేం పనిరా నాయన అంటూ నెటిజన్లు ఫైర్..
Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..

Boy skating  try to catch car goes dangerious stunt goes viral: కొందరు యువకులు రోడ్ల మీద డెంజరస్ స్టంట్ లు చేస్తుంటారు. చేతులు వదిలేసి బైక్ లను నడిపించడం చేస్తుంటారు. హెల్మెట్ లేకుండా బైక్ ను గాల్లో పైకి లేచేలా చేస్తారు. సడెన్ బ్రేక్ లు వేస్తూ, కట్ లు కొడుతుంటారు. మెయిన్ గా హైవేల మీద రేసింగ్ లకు పాల్పడుతుంటారు. స్పోర్ట్స్ బైక్ లను వేసుకుని రోడ్ల మీద విచ్చలవిడిగా వెళ్తుంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కొందరు వ్యూస్ లు, లైక్ ల కోసం రకరకాల స్టంట్ లు వేస్తుంటారు. టూవీలర్ , కార్లను ఇష్టమున్నట్లు నడిపిస్తుంటారు. కారును స్పీడ్ గా పొనిచ్చి, సడెన్ గా బ్రేక్ లు వేస్తుంటారు. సినిమా స్టైల్ లో కట్ లు కొడుతుంటారు. ట్రిబుల్ రైడింగ్ లు చేస్తు ట్రాఫిక్ రూల్స్ లను అస్సలు పాటించరు. కొందరు పెద్దగా సైరన్, బైక్ హరన్ చప్పులు చేసుకుంటూ స్పీడ్ గా వెళ్తుంటారు.

 

ఈ క్రమంలో రోడ్డుపైన ఇష్టమున్నట్లు వాహానాలు నడిపిస్తు వారు డెంజర్ లలో పడటమే కాకుండా, తమ వాళ్లను కూడా ప్రమాదాలలో నెట్టేస్తుంటారు.  వీరి వల్ల తమ దారిన తాము పోయే అమాయకులు కూడా బలైన సంఘటనలు కొకొల్లలు. రోడ్డుపైన కొందరు బస్సులు మీద, కారు వెనుకాల డిక్కీ ఓపెన్ చేసి ప్రమాదకరంగా కూర్చుంటారు. రోడ్డుపైన ట్రాఫిక్ లో రీల్స్ కూడా చేస్తుంటారు. ఇక్కడోక యువకుడు అచ్చం అలానే స్టంట్ చేయాలని చూశాడు. కానీ బొక్కా బొర్లాపడ్డాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

యువకుడు రోడ్డుమీద స్కెటింగ్ చేస్కుంటున్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. మరీ అతనికి ఏమన్పించిందో ఏమో కానీ.. రోడ్డుపక్కన వెళ్తున్న కారును చూశాడు. వెంటనే దాన్ని స్పీడ్ గా ఫోలో అయ్యాడు. అంతేకాకుండా.. దాన్నివెనుక నుంచి పట్టుకుని పోజులు కొట్టాలనుకున్నాడో ఏమో కానీ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది. దీంతో అతను అదుపు తప్పి, బొక్కా బోర్లా పడ్డాడు. అతను రోడ్డుమీద పడి అనేక పల్టీలు కొడుతూ.. రోడ్డుమీద సాగిలపడిపోయాడు. అతని లక్ బాగుందేమో కానీ ఆ టైమ్ లో రోడ్డుమీద ఏ వాహానం రాలేదు.

Read more: AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..  

ఒక వేళ వస్తే.. ఎంతపెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ వీడియోను.. @nikkym143 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం డెంజర్ స్టంట్ అంటూ మండిపడుతున్నారు. మరికొందరు వెనక నుంచి వెహికిల్ వస్తే నీ బతుకు బస్టాండే.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News