Europe Farmers Protest: ఢిల్లీలోనే కాదు..యూరోప్ దేశాల్లో కూడా అన్నదాతల నిరసనలు

దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన అందరికీ తెలిసిందే. రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేశారు. అయితే రైతుల నిరసన కేవలం ఇక్కడే కాదు విదేశాల్లో కూడా కన్పిస్తుంటుంది. యూరప్‌లోని చాలా దేశాల్లో తమ డిమాండ్ల సాధనకై రోడ్డెక్కారు. ప్రదర్శన చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం విషయంలో రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. 

Europe Farmers Protest: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన అందరికీ తెలిసిందే. రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేశారు. అయితే రైతుల నిరసన కేవలం ఇక్కడే కాదు విదేశాల్లో కూడా కన్పిస్తుంటుంది. యూరప్‌లోని చాలా దేశాల్లో తమ డిమాండ్ల సాధనకై రోడ్డెక్కారు. ప్రదర్శన చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం విషయంలో రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. 

1 /5

పోర్చుగల్‌లో రైతుల పరిస్థితిలో మార్పులు , ఇతర డిమాండ్లతో నిరసన ప్రదర్శన మొదలైంది. పోర్చుగల్‌లో నీటి కొరత ఏర్పడింది. 

2 /5

ఇటలీలో సైతం ఇదే పరిస్థితి. కరవు పరిస్థితులు వెంటాడుతున్నాయి. దాంతో ధాన్యం, పండ్లు, కూరగాయలు పండించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి రైతుల్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు యోచిస్తోంది. 

3 /5

స్పెయిన్‌లో కూడా ఇదే పరిస్థితి. ఫిబ్రవరి 1 నుంచి నిరసన ప్రదర్శన జరుగుతోంది. స్పెయిన్ వ్యవసాయ మంత్రి ఇప్పటికే రైతు సంఘాలతో చర్చించినా ప్రయోజనం లేకపోయింది. రైతులు ఉద్యమం నుంచి వెనక్కి తప్పుకోవడం లేదు. 1 లక్షా 40 వేలమంది రైతుల కోసం 290 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది ప్రభుత్వం. 

4 /5

ఇది బెల్జియం, యూరోపియన్ యూనియన్ రాజధాని. యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల రైతులు తమ డిమాండ్ల కోసం ఈ నగరంలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. కొత్త జలవాయు నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శన జరుగుతోంది. 

5 /5

రైతుల నిరసన ప్రదర్శన జనవరి నుంచి ప్రారంభమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మ్యాక్రాన్ రైతు విధానాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ప్రదర్శన చేస్తున్నారు.