Akshaya Tritiya 2024: అక్షయతృతీయ రోజు ఈ ఒక్క పనిచేస్తే.. మీకు ఉన్న డబ్బు, ఆస్తి పదిరెట్లు అవ్వడం ఖాయం..

Akshaya Tritiya 2024 Remedy: అక్షయ తృతీయ లక్ష్మీదేవిని పూజించే శుభదినం. ఈరోజు ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఏ పనిచేసిన రెట్టింపు లాభాలను అందిస్తుందని హిందూ సంప్రదాయంలో ఓ నమ్మకం.

Akshaya Tritiya 2024 Remedy: అక్షయ తృతీయ లక్ష్మీదేవిని పూజించే శుభదినం. ఈరోజు ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఏ పనిచేసిన రెట్టింపు లాభాలను అందిస్తుందని హిందూ సంప్రదాయంలో ఓ నమ్మకం. దీన్ని పాటిస్తున్నవాళ్లు కూడా కోకొల్లలు. అయితే, అక్షయ తృతీయ రోజు కొన్ని పనులు చేయడం వల్ల ప్రస్తుతం మీకు ఉన్న డబ్బులు, ఆస్తులు పదింతలు అవ్వడం ఖాయమని జోతిష్యనిపుణులు చెబుతున్నారు. 
 

1 /5

మన హిందూ సంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నాయి అందులో లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజులు అక్షయ తృతీయ, దీపావళి. ఈ మాసంలో లేని పెళ్లిలు, శుభకార్యాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈరోజంతా అత్యంత విశేషమైన రోజు. ఈరోజు మనం చేసే ఏ పని అయినా రెట్టింపు ఫలితాలను, లాభాలను అందిస్తుంది. ఈసారి మే 10 శుక్రవారం అక్షయ తృతీయ రానుంది. ఏ పనులు చేస్తే క్షయం కాకుండా ఉంటుందో తెలుసుకుందాం.  

2 /5

ప్రతి ఏడాది వైశాఖమాసంలో అక్షయ తృతీయ వస్తుంది. అయితే, ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో బయటపడతారు. వీరిపై లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అందుకే చాలామంది ఈరోజు బంగారం కొనుగోలు చేస్తారు. ఇలా అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే పదిరెట్లవుతుందని నమ్మకం.  

3 /5

లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే అక్షయ తృతీయ రోజున ఉప్పు, బియ్యం, పప్పులు, బెల్లం, నువ్వులు, నెయ్యి దానంగా ఇవ్వండి. అయితే, ఏ దానం చేసినా అపాత్ర దానం కాకుండా చేసుకోవాలి. కేవలం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు మాత్రమే దానం ఇవ్వాలి. అప్పుడే మీరు చేసిన దానానికి అర్థం ఉంటుంది.  

4 /5

అక్షయ తృతీయ దానానికి ప్రత్యేకం. ఒకవేళ మీరు అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతుంటే మాత్రం అక్షయ తృతీయ రోజు నిరుపేదలకు దుస్తులను దానంగా ఇవ్వండి. దీంతో మీరు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.  ఏళ్ల నుంచి అప్పులతో కొట్టుమిట్టాడుతున్నవారికి లక్ష్మీదేవి సరైన మార్గాన్ని చూపుతుంది.  

5 /5

అక్షయ తృతీయ నాడు ఈ పనులు చేయడం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న డబ్బు, ఆస్తి పదింతలు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)