Chiranjeevi Padma Vibhushan: ఈ ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు .. నా స‌హ‌చ‌ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, టెక్నిషియ‌న్స్‌కు అంకితం.. చిరంజీవి ఎమోష‌న‌ల్..

Chiranjeevi Padma Vibhushan: తాజాగా దిల్లీలో జ‌రిగిన ప‌ద్మ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి.. దేశ రెండో అత్యున్న పౌర‌పురస్క‌రమైన  ప‌ద్మ‌విభూష‌ణ్‌ను అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్‌లో విలేఖ‌రుల‌తో మాట్లాడారు.

1 /8

దిల్లీలో జ‌రిగిన ప‌ద్మ అవార్డుల్లో భాగంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా స‌హా ప‌లువురు పాల్గొన్నారు.

2 /8

2006లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హ‌యాంలో ప‌ద్మ భూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి.. తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే ప్ర‌భుత్వంలో ప‌ద్మ‌విభూష‌ణ్ అందుకున్నారు.  

3 /8

ఈ అవార్డు కార్య‌క్ర‌మానికి చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దిల్లీ వెళ్లారు. అక్క‌డ ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు.

4 /8

  ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం చిరంజీవి ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యంలో హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు రావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసారు.

5 /8

ఈ అవార్డు నాతో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు..నిర్మాత‌లు.. న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల కార‌ణంగా త‌న‌కు ఈ అవార్డు వ‌చ్చింన్నారు.

6 /8

అలాగే ఫ్యాన్స్ అండ‌దండ‌లు ఎపుడు మ‌రిచిపోలేను. అంద‌రీ పేరు పేరునా ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసారు.

7 /8

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై మాట్లాడారు. నేను ప్ర‌స్తుతం ఏ పార్టీలో లేను. పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న నా త‌మ్ముడు  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని కోరుకుంటున్నాను.

8 /8

పిఠాపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేను వెళ్ల‌డం లేదు. న‌న్ను ర‌మ్మ‌ని ఆయ‌న ఫోర్స్ చేయ‌లేదు. అలాగే సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు భార‌త‌రత్న వ‌స్తే సంతోషంగా ఉంటుంది. ప్ర‌భుత్వ స‌హకారంతో త్వ‌ర‌లో అది సాకారం అవుతుంద‌నే న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు.