Allu Arjun Wax statue Madame tussauds: అల్లు అర్జున్ సహా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైన భారతీయ నటులు వీళ్లే.. Part -1

Allu Arjun Wax statue Madame tussauds: గత కొన్నేళ్లుగా నటీనటుల ఇమేజ్‌కు సరికొత్త నిర్వచనం ఇస్తుంది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ఇందులో మైనపు విగ్రహంగా కొలువు తీరాలంటే ఆయా సెలబ్రిటీలు వాళ్ల రంగాల్లో నిష్ణాతులుగా ప్రూవ్ చేసుకోవాలి. ఈ కోవలో తెలుగు హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన మైనపు విగ్రహాన్నిమేడమ్ టుసాడ్స్‌లో కొలువు తీరింది. ఈయన కంటే ముందు ఈ మ్యూజియంలో కొలువు తీరిన భారతీయ నటులు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

1 /5

అల్లు అర్జున్.. అల్లు అర్జున్‌కు సంబంధించిన మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరింది. ఈ మైనపు విగ్రహాన్ని అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లి స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందుకున్న మూడో హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. అంతేకాదు దక్షిణాది నుంచి కూడా మరే ఇండస్ట్రీ హీరోలకు ఈ ఘనత దక్కలేదు.

2 /5

మహేష్ బాబు.. అల్లు అర్జున్ కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరింది. సూపర్ స్టార్ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో ఉన్న మేడమ్ టుసాడ్స్‌ మ్యూజియంలో కొలువైంది.  

3 /5

ప్రభాస్.. ఇక తెలుగు సహా దక్షిణాది నుంచి మేడమ్ టుసాడ్స్‌లో కొలువు దీరిన మొట్ట మొదటి హీరోగా ప్రభాస్ రికార్డులకు ఎక్కాడు. ఈయన విగ్రహాన్ని బాహుబలి గెటప్‌లో సింగపూర్‌లో కొలువు తీరింది.

4 /5

అమితాబ్ బచ్చన్.. ఇక మన దేశంలో మేడమ్ టుస్సాడ్‌లో కొలువైన మొట్ట మొదటి భారతీయుడు మరియు ఏషియన్ నటుడిగా అమితాబ్ బచ్చన్ రికార్డులకు ఎక్కాడు. బిగ్‌బీ నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాల జాతర మొదలైంది.  

5 /5

షారుఖ్ ఖాన్.. అమితాబ్ బచ్చన్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరారు బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్.