Telangana - BJP: తెలంగాణలో బీజేపీకి ఆ పార్టీ బేషరతు మద్ధతు..

Telangana - BJP: కలిసొచ్చే కాలానికి నడొచొచ్చే కొడుకు పుడుతాడని సామెత ఉంది కదా. ఇపుడు తెలంగాణ బీజేపీకి ఈ ఎన్నికల్లో అదే కలిసొచ్చే అంశంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉన్న ప్రముఖ పార్టీ.. బీజేపీకి బేషరతు మద్ధతు ప్రకటించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 8, 2024, 09:20 AM IST
Telangana - BJP: తెలంగాణలో బీజేపీకి ఆ పార్టీ బేషరతు మద్ధతు..

Telangana - BJP: తెలంగాణలో బీజేపీ పార్టీ దూకుడు మీదుంది. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను గెలిచి మంచి ఊపుమీదున్న భారతీయ జనతా పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలవాలనే ప్లాన్‌తో ముందుకు పోతుంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు  గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగింది. అటు బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పొట్టుకుంది. ఏపీలో జనసేన, తెలుగు దేశంతో కలిసి కూటమిగా బరిలో దిగుతోంది. ఇక తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగింది. తాజాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగు దేశం పార్టీ బీజేపీకి బేషరతు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతతల రామచంద్రారెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు.

గత ఎన్నికల్లో తెలంగాణ తెలుగు దేశం ఏ పార్టీకి మద్ధతు ఇవ్వకున్నా.. ఇండైరెక్ట్‌గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగు దేశం పార్టీ.. తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇవ్వాలని ఆ పార్టీ పొలిటిబ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి బేషజాలకు పోకుండా.. ప్రతి తెలుగు దేశం కార్యకర్త బీజేపీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా చింతల కోరారు. మన ఓటు ఇతరులకు వేస్తే నష్టం తప్ప ఇరువురికి ఎలాంటి లాభం ఉండదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా చింతల ఆకాంక్షించారు. ఈ నెల 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా  తెలుగు దేశం శ్రేణులు మోదీ పాల్గొనే బహిరంగ సభలో పాల్గొనాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్టు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు.  ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తోంది. అటు ఏపీలో కూటమిలో భాగంగా 6 సీట్లలో బరిలో ఉంది. మొత్తంగా రెండు ఉభయ రాష్ట్రాల్లో 23 స్థానాల్లో పోటీ చేస్తోంది.

ఇదీ చదవండి: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News