Nirmala sitharaman: మెట్రోలో నిర్మలా సీతారామన్ కు చేదు అనుభవం.. వైరల్ వీడియో..

Delhi metro ride: ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణించారు. ఒక కేంద్ర మంత్రి నిలబడి ఉన్న అక్కడున్న వారు కనీసం నిలబడి సీటు కూడా ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 20, 2024, 01:02 PM IST
  • మెట్రోలో జర్నీ చేసిన కేంద్ర మంత్రి..
  • అస్సలు పట్టించుకొని మెట్రో ప్రయాణికులు..
Nirmala sitharaman: మెట్రోలో నిర్మలా సీతారామన్ కు  చేదు అనుభవం.. వైరల్ వీడియో..

Nirmala sitharaman travels in delhi metro: నార్మల్ గా సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు చాలా అరుదుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్స్ లలో ప్రయాణిస్తుంటారు. అలాంటి సందర్భాలలో జనాలు, సెలబ్రీటీల దగ్గరకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. సెల్ఫీలు దిగడానికి పోటీలు పడుతుంటారు. ఎలాగైన తమ లీడర్ దగ్గరకు వెళ్లి కనీసం షేక్ హ్యాండ్, ఆటో గ్రాఫ్ కోసమైన ప్రయాణిస్తుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పటి వరకు వీఐపీ బందోబస్తులో ఉన్న వారు.. ఆ తర్వాత మాత్రం సింపుల్ గా జనాలతో మమేకమవుతుంటారు. ఇలాంటివి మనం రెగ్యులర్ గా చూస్తుంటాం.

 

ఇక ఎన్నికల తర్వాత ఏదైన నాయకుడిని కలవాలంటే మాత్రం అపాయింట్ మెంట్, కనీసం వారి ఇంటి గేటు వద్దకు కూడా రానివ్వడానికి సెక్యురిటీ వారి అనుమతించరు. ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.. ఢిల్లీమెట్రోలో  ప్రయాణించారు.  అక్కడున్న ప్రయాణికులు ఆమెను అస్సలు పట్టించుకోలేదు. కనీసం లేచీ నిలబడి సీటు కూడా ఇవ్వలేదు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని మెట్రోలో ఆమె గత శనివారం సీఏ కోచింగ్ తరగతులను సందర్శించడానికి వెళ్లారు. అప్పుడు ఆమె మెట్రోలో సాధారణ ప్రయాణికురాలిగానే నిలబడ్డారు. నిర్మలతూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌కు ఢిల్లీ మెట్రోలో ఎక్కారు. ఆ సమయంలో మెట్రో అంతా ఫుల్ రద్దీగా ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఆమెను వింతగా చూస్తున్నారు. కానీ ఆమెకు మాత్రం ఎవరు కూడా సీటు ఇవ్వలేదు. అంతేకాకుండా.. ఒక మహిళ వచ్చి ఆమెను పలకరించారు. నిర్మల చుట్టు టైట్ సెక్యురిటీ వాళ్లు కూడా ఉన్నారు. కనీసం ఏ ఒక్కరు కూడా నిర్మల పట్ల గౌరవంగా ప్రవర్తించలేదు.

అంతేకాకుండా.. ఆమె అసలు కేంద్ర మంత్రినా.. లేదా ఎవరైన రీల్స్ చేస్తున్నారా.. ?..  అన్న విధంగా డౌటానుమానంతో చూస్తు ఉండిపోయారు. మరికొందరు మాత్రం.. తమ మొబైల్ ఫోన్లలో నిర్మల వీడియోలను రికార్డు చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు కొందరు ప్రయాణికులపై మండిపడుతున్నారు. మన కేంద్ర మంత్రికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా...?.. ఆమె వయస్సుకైన గౌరవం ఇవ్వాలి కదా.. అంటూ మెట్రో ప్రయాణికులకు చురకలు పెడుతున్నారు.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

ఇక మరికొందరు మాత్రం.. అవును మరీ పన్నుల భారం వేస్తూ సామాన్యుల జీవనం అస్తవ్యస్తం చేసింది. ఇలాంటి వారికి దొరికే గౌరవంఇదేనంటూ.. సెటైర్ లు కూడా వేస్తున్నారు. ఏది ఏమైన వయస్సులో పెద్దావిడ నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు..టీనేజ్ వారు కూర్చుని ఉండటం సరికాదని కూడా కామెంట్లు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News