IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు

IMD Rain Alert: భగభగమండే ఎండల్నించి త్వరగానే ఉపశమనం లభించనుంది. ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా కేరళ తీరాన్ని తాకనున్నాయి. మరోవైపు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 16, 2024, 07:21 AM IST
IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు

IMD Rain Alert: మహారాష్ట్రలోని పశ్చిమ విదర్బ ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవహించింది. దీనికి తోడు మరో ద్రోణి కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా దేశంలో ప్రవేశించనున్నాయనే వార్త రైతాంగంలో ఆనందం కల్గిస్తోంది. 

నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి. మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకి జూలై 15 వరకూ దేశమంతా విస్తరించనున్నాయి. గత ఏడాది నైరుతి రుతువపనాలు ఆలస్యంగా ప్రవేశించడమే కాకుండా చలనం లేకుండా ఉండటంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఈసారి అలాకాకుండా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ అంచనా వేసింది. ఈసారి జూన్-సెప్టెంబర్ నెలల్లో భారీగా వర్షపాతం నమోదు కానుంది. ఇది కేవలం ఏపీ, తెలంగాణలకే కాకుండా దేశమంతా వర్తించనుంది. మరో నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడనుంది.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురవనుంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని సిరిసిల్ల, హనుమకొండ, మహబూబాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, అదిలాబాద్, జగిత్యాల, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. మరి కొన్ని ప్రాంంతాల్లో ఈదురుగాలులు కూడా వీయనున్నాయి. 

Also read: Mamata Banerjee: మరో బాంబ్‌ పేల్చిన మమతా బెనర్జీ.. ఇండియా కూటమికి రాం రాం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News