Farmers Protest: మళ్లీ కదం తొక్కుతున్న రైతులు.. ఢిల్లీలో ఎక్కడిక్కడ నిర్బంధం, సరిహద్దులు బంద్‌?

Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 11, 2024, 06:46 PM IST
Farmers Protest: మళ్లీ కదం తొక్కుతున్న రైతులు.. ఢిల్లీలో ఎక్కడిక్కడ నిర్బంధం, సరిహద్దులు బంద్‌?

Delhi On High Alert: రెండు, మూడేళ్ల కిందట తమ ఉద్యమంతో దేశ రాజధాని ఢిల్లీని దిగ్భందం చేసిన రైతులు మరోసారి అదే స్థాయిలో ఉద్యమం చేపట్టడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసిస్తూ ఢిల్లీ ముట్టడికి బయల్దేరారు. ఎన్నికల సమయం కావడంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు రైతులు ఉద్యమ బాట పట్టారు. దేశంలోని ప్రముఖ రైతుల సంఘాలన్నీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ఆందోళన చేపట్టడకుండా ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దాదాపు ఢిల్లీకి వెళ్లే రహదారులు మూతపడ్డాయి. మరొకసారి ఢిల్లీ, హర్యానా సరిహద్దులో భద్రతా బలగాలు భారీగా మొహరించారు.

Also Read: GPS Based Toll: ఇక ఫాస్టాగ్‌కు బై బై.. తెరపైకి కొత్త టోల్‌ విధానం.. ఇక హైవేపై రయ్యిన దూసుకెళ్లొచ్చు

కనీస మద్దతు ధర, రాయితీలు వంటి సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు 'ఛలో ఢిల్లీ'కి పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ నెల 13వ తేదీన దాదాపు 200 రైతు సంఘాలు 'ఛలో ఢిల్లీ'కి పిలుపునిచ్చాయి. మంగళవారం ఢిల్లీని ముట్టడించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రైతులు తరలివస్తున్నారు. వీరి పిలుపుతో హరియాణా, దిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి.

Also Rea: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ప్రధాన రహదారుల్లో క్రేన్లు, కంటెయినర్లను పోలీస్‌ అధికారులు సిద్ధం చేశారు. ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్రేన్లు, కంటెయినర్లను దాటుకుని ఢిల్లీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తే రోడ్లను మూసివేయడానికి కూడా భద్రతా బలగాలు వెనుకాడడం లేదు. సరిహద్దులను మూసివేయడానికి కూడా సిద్ధమయ్యారు.

రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమంతో హర్యానా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. అత్యవసర పనుల కోసం తప్ప అనవసరంగా ప్రధాన రహదారులపైకి రావొద్దని హరియాణా పోలీసులు సూచనలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి వచ్చే మార్గాలైన అంబాల, సోనిపట్‌, పంచకుల్‌లో 144 సెక్షన్‌ను విధించారు. రైతుల పిలుపు నేపథ్యంలో 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఎందుకంటే 2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు రైతులు ఎర్రకోటను ముట్టడించిన విషయం ఇంకా గుర్తుంచుకున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆనాడు నల్ల చట్టా రద్దుతోపాటు కనీస మద్దతు ధర, రాయితీల పెంపు వంటి కీలక డిమాండ్‌లను పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఉద్యమం సమయంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రెండు మూడేళ్లవుతున్నా కేంద్రం నుంచి ఇప్పటివరకు సరైన స్పందన రాకపోవడంతో మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్ తో సహా దేశంలోని ప్రముఖ రైతు సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నాయి. కాగా ఛలో ఢిల్లీని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతు సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులు మూసేసినా ఎలాగైనా ఛలో ఢిల్లీని చేపడతామని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఛలో ఢిల్లీ అనంతరం ఈనెల 16వ తేదీన భారత్‌ బంద్‌కు కూడా రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని అనేక సమస్యలపై ప్రజా, ఉద్యోగ, కార్మిక, రైల్వే తదితర సంఘాలన్నీ భారత్‌ బంద్‌ చేపడుతుండగా ఆ బంద్‌కు రైతు సంఘాలు కూడా మద్దతునిచ్చాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News