ఆన్‌లైన్ క్లాసెస్‌కి smartphone కొనివ్వ లేదని విద్యార్థి ఆత్మహత్య

Online classes వినడానికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడాన్ని ఓ ఇబ్బందిగా భావించిన టెన్త్ క్లాస్ విద్యార్థి.. అదే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

Last Updated : Aug 1, 2020, 11:43 AM IST
ఆన్‌లైన్ క్లాసెస్‌కి smartphone కొనివ్వ లేదని విద్యార్థి ఆత్మహత్య

చెన్నై : Online classes వినడానికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడాన్ని ఓ ఇబ్బందిగా భావించిన టెన్త్ క్లాస్ విద్యార్థి.. అదే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన త‌మిళ‌నాడులోని కడ‌లూరు జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కడలూరు జిల్లా పన్రుతిలో వల్లలార్ హై స్కూలులో 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్ తరగతులు వినడానికి స్మార్ట్ ఫోన్ ( Smartphone) కొనివ్వలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అక్కడి జిల్లా పోలీసులు తెలిపారు. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత విద్యాసంస్థలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెబుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో కరోనా వ్యాప్తి మరింత అధికంగా ఉండటంతో అక్కడ లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని విద్యా సంస్థలు సైతం అన్ని చోట్లలాగే ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వల్లలార్ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి కూడా ఆన్‌లైన్ క్లాసెస్ కోసం తనకు స్మార్ట్ ఫోన్ ఇప్పించాల్సిందిగా తండ్రిని కోరాడు.  

Also read: TS high court: ఆన్‌లైన్ క్లాసెస్, ఫీజు వసూళ్లపై మండిపడిన హై కోర్టు 

ఓ సాధారణ రైతు అయిన ఆ విద్యార్థి తండ్రి.. తాను పండిస్తున్న జీడిపప్పు పంట అమ్ముడుపోగానే ఆ డబ్బులతో ఫోన్ కొనిస్తాన‌ని చెప్పాడు. కానీ అప్పటికే తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి క్ష‌ణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు ( Tenth class student committed suicide). ఆన్‌లైన్ క్లాసెస్ వినడానికి స్మార్ట్ ఫోన్ లేని కారణంగా ఓ విద్యార్థి మనస్తాపానికి గురై అర్థాంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Also read: Telangana: 24 గంటల్లో 2,083 కరోనా కేసులు

Trending News