Seven Soups: బరువు తగ్గేందుకు ఏడు రకాల అద్భుతమైన సూప్‌లు ఇవే

Seven Soups: బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ 7 రకాల హై ప్రోటీన్డ్ సూప్స్ ట్రై చేయండి. శీతాకాలంలో వెచ్చదనంతో పాటు..మీ వెయిట్ కూడా తగ్గిస్తుంది. అదెలాగో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 21, 2022, 09:47 AM IST
Seven Soups: బరువు తగ్గేందుకు ఏడు రకాల అద్భుతమైన సూప్‌లు ఇవే

Seven Soups: బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ 7 రకాల హై ప్రోటీన్డ్ సూప్స్ ట్రై చేయండి. శీతాకాలంలో వెచ్చదనంతో పాటు..మీ వెయిట్ కూడా తగ్గిస్తుంది. అదెలాగో చూద్దాం.

సూప్స్ అనేవి రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచివి. త్వరగా జీర్ణమవడమే కాకుండా నీరసంగా ఉన్నప్పుడు లేదా ఒంట్లో బాగా లేనప్పుడు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు సూప్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని కలగజేయడమే కాకుండా..బలాన్ని అందిస్తాయి. అంతేకాదు..కొన్ని రకాల సూప్స్ శరీర బరువును కూడా తగ్గిస్తాయంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. అటువంటి 7 రకాల సూప్స్ మీ కోసం...

క్యాబేజ్ సూప్ (Cabbage Soup)

క్యాబేజ్ సూప్ అనేది చాలా ప్రాచుర్యమైందే. ఎక్కువ మోతాదులో క్యాబేజ్ సూప్ తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..ఈ శీతాకాలంలో క్యాబేజ్ సూప్ ఎక్కువగా తీసుకోండి.

పప్పులు, ఆనపకాయ, రేగుపండ్ల సూప్ ( Lentils, Pumpkins and Cranberry Soup)

నాన్ వెజ్ ఆహారం వద్దనుకునేవారికి ఈ సూప్ చాలా మంచిది. శరీరానికి కావల్సిన ప్రొటీన్ అవసరాల్ని తీర్చేందుకు ఈ సూప్స్ చాలా ఉపయోగపడుతాయి. శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా..బరువు తగ్గించడంలో ఈ సూప్స్ చాలా దోహదపడుతాయి.

చికెన్ సూప్ (Chicken Soup)

చికెన్ లేకుండా ఆహారం అంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఎక్కువశాతం ప్రజలు ఇష్టపడే నాన్ వెజ్ చికెన్. అయితే ఇదే చికెన్ సూప్ శరీరంలో అధికాకంగా ఉన్న బరువును, ఫ్యాట్‌ను కరిగిస్తుందని ఎంతమందికి తెలుసు. ఇదే చికెన్ సూప్‌‌ను బీన్స్ , టొమాటోతో కలిపి తీసుకుంటే ఇంకా ప్రయోజనకరం. 

స్పినాచ్ సూప్ (Spinach Soup)

శీతాకాలంలో మద్యాహ్నం వేళల్లో ఆకలేసినప్పుడు లేదా ఏదైనా తినాలన్పించినప్పుడు.. మంచి వెన్నతో కలిపిన స్పినాచ్‌ను తీసుకుంటే చాలా మంచిది. ఇది మంచి రుచిని అందించడమే కాకుండా..ప్రోటీన్ ఫుడ్‌గా ఉంటుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. బరువు తగ్గిస్తుంది. 

క్యారట్, టొమాటో సూప్ (Carrot and Tomato Soups)

ఎక్కువ మొత్తంలో పోషక పదార్ధాలు, విటమిన్లతో కూడిన క్యారట్, టొమాటో సూప్ ఇది. క్యారట్, టొమాటో సూప్ అద్భుతమైన రుచితో పాటు మంచి శక్తిని అందిస్తాయి.  క్యారట్స్ అనేవి తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి.

గ్రీన్ పీస్ సూప్ (Green Peas Soup)

ఇంట్లో రొటీన్ వంటలో విసుగు చెందినప్పుడు బఠాణీ సూప్ కొత్తదనాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి బఠాణీలు. మీ ఆహారంలో బఠాణీల సూప్ చేర్చుకుంటే కొత్తదనంతో పాటు బరువు కూడా తగ్గుతుంది.

మకరానీ పాస్తా సూప్ (Makorani Pasta Soup)

ఇది కచ్చితంగా లోఫ్యాట్ సూప్. ఈ సూప్‌తో చాలా లాభాలున్నాయి. కొద్దిగా చికెన్ లేదా వెజిటెబుల్స్‌తో కలిపి సూప్ చేస్తే రుచితో పాటు అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడంలో ఈ సూప్ దోహదపడుతుంది.

Also read: Cracked Heels Remedy: చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News