Winter Risks: చలికాలంలో గుండె పోటు సమస్య పెరగడానికి కారణం ఇదే, ఈ టిప్స్ పాటించండి

Winter Risks: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు అన్నీ ఇలాంటివే. ఇందులో కొలెస్ట్రాల్ మరింత ప్రమాదకరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 20, 2023, 01:09 PM IST
Winter Risks: చలికాలంలో గుండె పోటు సమస్య పెరగడానికి కారణం ఇదే, ఈ టిప్స్ పాటించండి

Winter Risks: కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. ఒక్క కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మరీ ముఖ్యంగా చలికాలంలో కొలెస్ట్రాల్ ప్రమాదం మరింత పెరిగిపోతుంది. బహుశా అందుకే చలికాలంలో హార్ట్ ఎటాక్ కేసులు కూడా పెరుగుతుంటాయి.

ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి కారణంగా గుండెపోటు వ్యాధులు పెరిగిపోతున్నాయి. దేశంలో పెరుగుతున్న గుండె వ్యాధులకు కారణం అణ్వేషించినప్పుడు కొలెస్ట్రాల్ అతి పెద్ద సమస్యగా మారిపోయింది. కొలెస్ట్రాల్ ఉండటం వల్ల రక్త నాళికల్లో బ్లాకేజ్ ఉంటోంది. దాంతో రక్తం గుండె వరకూ చేరడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. శరీరంలో కొరోనరీ ఆర్టరీస్ చాలా మృదువుగా ఉంటాయి. వీటి ద్వారానే గుండెకు ఎనర్జీ, ఆక్సిజన్ లభిస్తాయి. కానీ చలికాలంలో ఈ సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. ఫలితందా ఛాతీలో నొప్పి సమస్య, హార్ట్ ఎటాక్ వంటివి తలెత్తుతాయి.

చలికాలంలో రక్త నాళాల్లో సంకోచిస్తాయి. ఫలితంగా రక్తం శరీరంలోని అన్ని అంగాలకు చేరడుంలో ఆటంకం కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో అధిక రక్తపోటు సమస్య ఉత్పన్నమౌతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో గుండెపోటు వ్యాధులు రావచ్చు. చలికాలంలో పగలు చిన్నగా, రాత్రి ఎక్కువ సేపు ఉంటుంది. దాంతో శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఫలితంగా కార్టిసోల్ తక్కువ ఉత్పత్తి అయి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొరోనరీ డిసీజ్ ముప్పు పెరిగిపోతుంది. 

శీతాకాలంలో సాధారణంగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. చలి ప్రభావం లేదా బద్ధకం కారణం కావచ్చు. దాంతో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. గుండె పోటు సమస్య ఉత్పన్నమౌతుంది. చలికాలంలో ముందుగా చలి నుంచి రక్షించుకోవాలి. అంటే చలికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకాకూడదు. శరీరంలో ఉష్ణోగ్రత సమ స్థితిలో ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో హార్ట్ ఎటాక్ ముప్పు రావచ్చు. డైట్ కూడా మితంగా తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామం తప్పకుండా చేయాలి. 

Also read: Unhealthy breakfast: బ్రేక్ ఫాస్ట్ గా అస్సలు తీసుకోకూడని పదార్థాలు ఏవో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News