Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు

Custard Apple benefits సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు: వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ( Sitaphal benefits ) కలిగి ఉంటుంది. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి.

Last Updated : Aug 25, 2020, 03:53 PM IST
  • పోషకాల ఘనిగా పేరున్న సీతాఫలం ఎన్ని రకాల పోషక విలువలు ఉంటాయో తెలుసా ?
  • అనేక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే విటమిన్లు, ప్రోటీన్ల లోపాలను సవరించే శక్తి సీతా ఫలం సొంతం.
  • బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ పేషెంట్స్‌కి చక్కటి డైట్. కాకపోతే సీతాఫలం విషయంలో Obesity, Diabetes patients తెలుసుకోవాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు

Custard Apple benefits సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు: వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ( Sitaphal benefits ) కలిగి ఉంటుంది. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. Also read :  Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి

సీతాఫలం అల్సర్లను ( Ulcers diet ) నయం చేయడంలో, అసిడిటీని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా ( Soft skin ) చేస్తాయి. Also read :  Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?

ఇది కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు ( Eye vision, hair, brain functioning ) మెరుగుపరుస్తుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ( Food for diebetes patients ) ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. Also read :  Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు

సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని డైట్ ( Weight loss diet ). కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదు అని గుర్తుంచుకోండి. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును ( High BP ) తగ్గిస్తుంది. Also read : Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం

Trending News