Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయద్దు.. అవే హార్ట్ ఎటాక్ సంకేతాలు..

Heart Attack Early Symptoms : అతి చిన్న వయసు ఉన్నవారు కూడా చాలా సడన్గా గుండెపోటు వచ్చి చనిపోయారు అని వార్తలు వింటున్నాం. కానీ గుండెపోటు వచ్చే నెల ముందు నుంచి మన శరీరం మనకి కొన్ని కీలకమైన సంకేతలను ఇస్తుందట. అవేంటో మనం ముందే తెలుసుకుని ఎలెక్ట్ గా ఉంటే గుండె జబ్బులను సైతం నివారించవచ్చు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 23, 2024, 03:07 PM IST
Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయద్దు.. అవే హార్ట్ ఎటాక్ సంకేతాలు..

Heart Attack Symptoms in Adults: ఈ మధ్యకాలంలో చాలామంది హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటిదాకా ఎటువంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ప్రాణాలు విడుస్తున్నారు. మారుతున్న జీవన విధానం, చెడు ఆహారం ఇలా ఎన్నో కారణాలవల్ల యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 

అయితే హృదయ సంబంధిత వ్యాధులు చాలావరకు మనకి సంకేతాలు ఇచ్చే వస్తాయట. ఆఖరికి గుండెపోటు కూడా వచ్చే నెల ముందు నుంచే మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకొని అలాంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే గుండెపోటుని సైతం నివారించవచ్చు అని తెలుస్తోంది.

మొదటగా గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు నుంచి దవడలో నొప్పి మొదలవుతుంది. ఇక గుండెపోటు వచన సమయంలో దవడ నొప్పి భరించలేనటువంటి విధంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

మెడ నొప్పి కూడా గుండెపోటుకి సంబంధించిన ఒక సంకేతమే అని నిపుణులు అంటున్నారు. ఉన్నపలంగా ఒక్కసారిగా మెడలో విపరీతమైన నొప్పి కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.

గుండెపోటు కి ముందు భుజం కూడా నొప్పి చేస్తుందట. ఎలాంటి కారణం లేకుండా సడన్ గా భుజం లో నొప్పి వచ్చినా వైద్యులను సంప్రదించాలి. 

కొందరిలో గుండె పోటు కి ముందు వెన్ను నొప్పి కూడా ప్రాథమిక లక్షణంగా ఉంటుందట. ఇక గుండెపోటు వచ్చే కొన్ని నెలలు ముందు నుంచే ఛాతిలో నొప్పి కూడా మొదలవుతుంట. ఎలాంటి ఎసిడిటీ లేకుండా చాతిలో నొప్పి వస్తే వెంటనే ఎలర్ట్ అవ్వాలని నిపుణులు అంటున్నారు.

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News